2, మే 2022, సోమవారం

కొత్త వింత కనుగొన్నారా

 పల్లవి ;- వింత చూసారా, ఈ వింతను కనుగొన్నారా!?

వనమయూరి నేడు - నృత్య నర్తన ప్రభలు వెదజల్లుతున్నాది ; ||

1] నిన్న మొన్నటి దాక, ఇంత క్రితము వరకు -

మందగొండిగ ఉండె సౌందర్యరాశి ;

జడత్వమ్ము మెండుగా నిండి ఉన్నది ;

అవధి లేనంతగా -

జడత్వమ్ము మెండుగా నిండి ఉన్నది పిట్ట ,

ఈ నెమలి పిట్ట ;

2] పురి నిండ కన్నులే కన్నులు ;

అంత చక్కని బర్హి ముడుచుకుని బబ్బుంది,

సొగసులకు తానే - సోగ కన్నుల్లు ;

బుంగమూతి పెట్టి ముక్కుతూ ఉన్నది ;

ఇన్నాళ్ళుగ ఇంత, మతిమరుపులో మునిగి,

మందగొండిగ ఉండె, సౌందర్యరాశి ;

ఎందువలనో ఏమొ తెలియకున్నాది ; ||

3] అమ్మ వచ్చింది, యశోదమ్మ వచ్చింది,

ఊయెలలొ శిశువు - క్రిష్ణమ్మ -- సిగముడిని ముడిచింది

చక్కంగ నెమలి పింఛాల ధరియించి బర్హి పింఛధారి ఐన ;

మోహన కృష్ణుని చూచి - నిలువెల్ల పులకించి ;

నాట్య మోహిని ఆయె అయ్యారె! నెమలి ;

ఈకల కట్టను విదిలించుకొంది - నెమలీకల కట్టను విదిలించుకొంది ;

పురి కాస్త హరివిల్లు వన్నెలై విరిసేను - నాట్య మోహిని ఆయె చెంగనాల నెమలి ;

నాట్య మయూరి బిరుదు పొందింది మన నెమలి ;

వింత కనుగొన్నారా!? ఈ కొత్త వింత కనుగొన్నారా !?? ;

&

song  21 ; రచయి3 = కుసుమ ; శుభకృత్ సుమ గీత మాలిక - 21 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి