3, మే 2022, మంగళవారం

నవ్వు తరువుల సంబరం

మోడు మాను కొమ్మలకు ;

పాట నేర్పు దరహాసం ;

రాధ అధర దరహాసం ; ||

కొమ్మలకు పులకింతలు ;

గీతమ్ముల సంపదలు ;

కమ కమ్మని -

గీతావళి సంపదలు ; ||

పువుల తొణుకు పుప్పొళ్ళు ;

మకరంద ధార - రవళికి ఆధారం ;

మోహన రవళికి ఆధారం ; ||

సుధా ధార సంగీత రాణి ;

ఆసీనయౌ - సింహాసనం అయ్యానని ;

తరువుకెంత సంబరమో!! ; ||

=================,

mODu maanu kommalaku ;

pATa nErpu darahaasam ;

raadha adhara darahaasam ; ||

kommalaku pulakimtalu ;

geetammula sampadalu ;

kama kammani - geetAwaLi sampadalu ; ||

puwula toNuku puppoLLu ;

makaramda dhaara - rawaLiki aadhaaram ;

mOhana rawaLiki aadhaaram ; ||

sudhaa dhaara samgeeta rANi ;

aaseenayau -

sim hAsanam ayyaanani ;

taruwukemta sambaramO!! ; ||

&

song - 32 ; శుభకృత్ సుమ గీత మాలిక -  32 ; రచయి3 = కుసుమ ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి