మూడు నవ్వులు - ఆరు వెన్నెలలు ...... , ;
ఇచ్చోట, అచ్చెరువే ;
ముగ్ధ లావణ్య రాధిక ఉన్నది -
అందుకనే - ఇచ్చోట -
మూడు నవ్వులు - ఆరు వెన్నెలలు -
ఓ సఖియా!
గానలోలుడు, నీలమోహనుని ఎడదలోన ;
తానే వెలిగే దీపము ;
తిష్య తిమిర లోకమ్ములన్నిటికి - ;
తానే దీపిక -
మన సుమ సుకుమారి రాధిక ; ||
తన ప్రతి ఊహయు కిరణవల్లరి ;;
అందులకే, రాధ కతమున -
క్రిష్ణ గాధలు తేజరిల్లుచుండు ;
నిరంతరమ్ము తేజరిల్లుచుండు ; ||
================== ;
mUDu nawwulu - aaru wennelalu ...... ,
iccOTa, acceruwE ;
mugdha lAwaNya raadhika unnadi -
amdukanE - iccOTa -
||mUDu nawwulu - aaru wennelalu -
O saKiyA! ||
gAnalOluDu, neelamOhanuni eDadalOna ;
taanE weligE deepamu ;
tishya timira lOkammulanniTiki - ;
taanE deepika -
mana suma sukumaari raadhika ; ||
tana prati uuhayu kiraNawallari ;;
amdulakE, raadha katamuna -
krishNa gaadhalu tEjarillucumDu ;
niramtarammu tEjarillucumDu ; ||
;
శుభకృత్ సుమ గీత మాలిక - 41 ; రచయి3 = కుసుమ ;
& & + Ksp రాధా వేణు రవళి ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి