ఆలమందల ధూళి ఎగసెను ;
సంధ్య వన్నెలు - అరుణిమలాయెను ;
పాటలగంధి - నీదు రాధిక -
వెన్నముద్దలు చేసిఉంచినది ;
మయూరి తోటి కబురు పంపినది ;
నీకు తెలుపలేదా ...,
కబురును - మయూరి తెలుపలేదా!? - - -
యమునా వాహిని కెరటమ్ము, నురుగులు ;
నీ నాట్యజాలమున -
బందీలవగా - పరితపించుచూ -
ఎగయుచున్నవి -
కొంటెతనములకు ముద్దుబిడ్డవు -
లీలాక్రిష్ణా, రావయ్యా! ||
=============== ,
aalamamdala dhULi egasenu ;
samdhya wannelu - aruNimalaayenu ;
paaTalagamdhi - needu rAdhika -
wennamuddalu cEsiumcinadi ;
mayuuri tOTi kaburu pampinadi ;
neeku telupalEdaa ...,
kaburunu - mayuuri telupalEdaa!? - - -
yamunaa waahini keraTammu, nurugulu ;
nee naaTyajaalamuna -
bamdeelawagaa - paritapimcucuu -
egayucunnawi -
komTetanamulaku muddubiDDawu -
leelaakrishNA, rAwayyA! ||
& శుభకృత్ సుమ గీత మాలిక - 52 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి