చల్లనైన నీ చూపులు పూల గొడుగులు ;
అమావాస్య నిశి రేయి యాచించుచున్నది నిన్ను ;
పున్నమిగా తను మారేనట, రాధికా ; ||
;
విరాళి ఏల, రాధికా! ప్రియాళి ధ్యాన దీపికా ;
శిఖి పింఛమౌళి మురళి రవళి కోసమెగా -
విరహ క్రోధ నవ రసాళి - ఇంత జాగు, చాలిక ;
కొమ్మలలో రామచిలుక తొంగిచూచుచున్నది ;
రాధ - నీదు - కినుక కూడ కందళించు వెన్నెలయే -
అనుచు - పచ్చదనము నారబోయు రాచిలుక ;
"చిలక పచ్చ" వన్నియలను - ఆరబోయు ముచ్చటగా,
చల్లబడవె రాధికా ; మా ముద్దుల మల్లికా ; ||
;
అదిగదిగో వేణు రవళి, శ్రీకృష్ణ వాత్సల్య రసకేళి ;
లాస హాస ధవళిమ, ముదిత రాధ ఆమోదము ;
ఒసగేను ముదము ప్రకృతికి - ఇక, వలసినంత చంద్రిక ;
రాత్రి ఇపుడు పున్నమి - రేయి నిత్య పౌర్ణమియే ; ||
==========================,
callanaina nee cuupulu puula goDugulu ;
amaawaasya niSi rEyi yaacimcucunnadi ninnu ;
punnamigaa tanu maarEnaTa, raadhikaa ; ||
wirALi Ela, rAdhikA! priyALi dhyAna dIpikaa
;
SiKi pimCamauLi muraLi rawaLi kOsamegA -
wiraha krOdha nawa rasALi - imta jAgu, cAlika
;
kommalalO raamaciluka tomgicuucucunnadi ;
raadha - needu - kinuka kUDa kamdaLimcu wennelayE -
anucu - paccadanamu nArabOyu raaciluka ;
"cilaka pacca" wanniyalanu - aarabOyu muccaTagA,
callabaDawe raadhikaa ; maa muddula mallikaa ; ||
adigadigO wENu rawaLi, SreekRshNa waatsalya rasakELi ;
lAsa hAsa dhawaLima, mudita rAdha AmOdamu ;
osagEnu mudamu prakRtiki - ika, walasinamta camdrika ;
rAtri ipuDu punnami - rEyi nitya paurNamiyE ; ||
&
song - 38 ; శుభకృత్ సుమ గీత మాలిక - 38 ; రచయి3 = కుసుమ ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి