2, మే 2022, సోమవారం

ఆడ నీవుంటివి - ఈడ నీవుంటివి

 ఆడ నీవుంటివి - ఈడ నీవుంటివి ;

ఆడ ఈడ నీవుంటివి - అన్నిటా వెదుకాడితి ; క్రిష్ణా,

గోపి నిటుల - వేధించుట తగునా - రా రా నా స్వామీ! ; ||

ఏ పొద మాటున దాగినావు - ఏ పైట - కొంగున దాగున్నావు ;

గోపి నిటుల - వేధించుట తగునా - రా రా నా స్వామీ! ; ||

మొయిలు చాటు మెరుపు వోలె - దాగుడుమూతలు ఏల ;

రాధ నవ్వు మెరుపులతో - జత చేయుము నీ నగవులు ;

క్రిష్ణయ్యా! జత చేయుము నీ నగవుల ; || ;

;

song - 22 ; శుభకృత్ సుమ గీత మాలిక - 22 ; రచయి3 = కుసుమ ;;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి