నెలవంకకు సాపత్యం - నెలత రాధ కెమ్మోవి ;
పెదవి అంచు చేరినది, చిన్ని వేణువు ; ||
కదిలించును అధరమ్ములు ;
రాధ - కదిలించగ అధరమ్ముల ;
పలికించే రాగఝరి ;
పులకించెను ప్రకృతి ఎద ; ||
కురిపించెను సంగీతము ;
రాధ - కురిపించగ సంగీతము ;
దిశలన్నియు పురి విప్పిన ;
పింఛము తరి మెరిసేను ; ||
త్రిభువనములకు అదనముగా ;
ఒనగూడెను స్వర జతులు ;
భావ జ్ఞాన గాధావళి తేజములు ; ||
========= ;
nelawamkaku saapatyam - nelata raadha kemmOwi ;
pedawi amcu cErinadi, cinni wENuwu ; ||
kadilimcunu adharammulu ;
raadha - kadilimcaga adharammula ;
palikimcE raagajhari ;
pulakimcenu prakRti eda ; ||
kuripimcenu samgeetamu ;
raadha - kuripimcaga samgeetamu ;
diSalanniyu puri wippina ;
pimCamu tari merisEnu ; ||
tribhuwanamulaku adanamugaa ;
onagUDenu swara jatulu ;
bhaawa jnaana gaadhaawaLi tEjamulu ; ||
& *
శుభకృత్ సుమ గీత మాలిక - 62 ;; రచయి3 = కుసుమ ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి