3, మే 2022, మంగళవారం

లిపి - బొమ్మలు, ప్రతీకలు

లిపి - బొమ్మలు, ప్రతీకలకు - పారవశ్యమే ;

శ్రీకృష్ణలీలలు గ్రోలుతు ; ||

పద్యాలై, శ్లోకాలయి ; భక్తి కథలు, కావ్యాలుగ -

పౌరాణిక గాధలకు శోభ లొసగి ;

మారి మారి, తనివినొందు ; ||

తాళ పత్రములు పట్టినాడు సూరదాసు ;

తుకారామ్, మీరా - అగణిత భక్తకోటి -

మానస సరసులందు ఓలలాడు రాజహంస -

క్రిష్ణ, విఠల్, క్రిష్ణ విఠల్ ; ||

ఇక, అందుకోండి కవులారా - ఆ హృదయాహ్లాదం ;

అక్షరాల గుడి దీర్ఘాల్ కొమ్ములన్నీ ;

ఓత్వాలు, విసర్గలను సరిదిద్దండి ;

ప్రణయ భావ జిలుగులను అద్దండి ;

అద్దండి హత్తండి కొత్త జిలుగులు ;

హత్తండి హత్తండి కొత్త జిలుగు తళుకులు ;

యుగయుగాల క్రిష్ణ గాధ, మధురం మధురం ;

హత్తెరిగి, అందుకేనండీ, ఇది-

సదా సదా - మననం, మననం ; ||

==================,

lipi - bommalu, prateekalaku - paarawaSyamE ;

SreekRshNaleelalu grOlutu ; ||

padyAlai, SlOkAlayi ; bhakti kathalu, kAwyAluga -

paurANika gaadhalaku SOBa losagi ;

maari maari, taniwinomdu ; ||

tALa patramulu paTTinADu suuradaasu ;

tukaaraamm, meeraa - agaNita bhaktakOTi -

maanasa sarasulamdu ; OlalADu rAjaham sa -

krishNa, wiThal, krishNa wiThal ; ||

ika, amdukOwOmDi kawulaaraa - aa hRdayaahlaadam 

;

aksharaala guDi dIrGAl kommulannee ;

Otwaalu, wisargalanu sarididdamDi ;

praNaya BAwa jilugulanu addamDi ;

addamDi hattamDi kotta jilugulu ;

hattamDi hattamDi kotta jilugu taLukulu ;

yugayugAla krishNa gAdha ; madhuram madhuram ;

hatterigi, amdukEnamDI,

idi-  sadaa sadaa - mananam, mananam ; ||

&

శుభకృత్ సుమ గీత మాలిక - 36 ; రచయి3 = కుసుమ ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి