3, మే 2022, మంగళవారం

చిత్ర కావ్య పల్లవం

మహర్నవం, పునర్నవం - నవ నవీనమే ;

చిత్ర కావ్య పల్లవం - నిత్య పల్లవి ;

కృష్ణ ధ్యాన చరణం - ఏక ధ్యాస గీతము ;

తదేక ధ్యాస కావ్యావళి - ఇది రంగరంగేళీ ; ||

ఎవరి మాట వినడండీ, వేణురాగ వినోది -

మోహనాల కృష్ణుడు ;

బహు మొండి గోపిక - బొత్తిగా మాట్లాడదు,

ఈ గోపిక, సుమండీ ;

ఇలాగైతె ఎట్లాగ - సూత్రం ముడి పడేను ;

స్నేహ సూత్రం ముడి పడేను ; ||

ముడి పడిన పెదాలేమొ బుంగమూతి ;

గోపిక - ముడి పడిన పెదాలేమొ బుంగమూతి ;

ముడి వీడిన కురులేమో నంగనాచి ;

నిడుపాటి కేశాలు నంగనాచి ;

ఇరు మనసుల మూగభాష ఆత్రంగా ;

చిడిముడి పడిన ఊహలెన్నో చిత్రంగా ;

పీటముడిని విప్పగల ప్రజ్ఞ ఎవరిదో ; ||

=====================,

maharnawam, punarnawam - nawa nawInamE ;

citra kAwya pallawam - nitya pallawi ;

kRshNa dhyAna caraNam - Eka dhyAsa gItamu ;

tadEka dhyAsa kAwyAwaLi - idi ramgaramgELI ; ||

ewari maaTa winaDanDI, wENuraaga winOdi -

mOhanaala kRshNuDu ;

bahu momDi gOpika - bottigaa mATlADadu,

ee gOpika, sumamDI ;

ilaagaite eTlaaga - suutram muDi paDEnu ;

snEha suutram muDi paDEnu ; ||

muDi paDina pedAlEmo bumgamUti ;

gOpika - muDi paDina pedaalEmo bumgamUti ;

muDi wIDina kurulEmO namganAci ;

niDupATi kESAlu namganaaci ;

iru manasula muugaBAsha aatramgaa ;

ciDimuDi paDina uuhalennO citramgA ;

pITamuDini wippagala prajna ewaridO ; ||

&

శుభకృత్ సుమ గీత మాలిక -  33 ; రచయి3 = కుసుమ ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి