3, మే 2022, మంగళవారం

మనసు పాలపిట్ట

మనసేమో పాలపిట్ట,

అంత ఎత్తు ఎగర లేదు ;

నా మనసేమో పాలపిట్ట,

అంత ఎత్తు ఎగర లేదు ; ||

నెమలి వోలె పురి లేదు ;

నాట్యాల మురిపించ నిన్ను ;

పావురాయి కాను నేను,

కువకువలాడగ లేను ; ||

సీతాకోకను కాను ;

వన్నె రెక్కలు లేవు ;

చిన్ని పాలపిట్ట - మనసు ;

అంత ఎత్తు ఎగర లేదు ; ||

కనికరమును నీ చూపున ;

కురిపించుము, చాలును ;

పిసరంత నీ నవ్వు చాలు ; ||

;

ఉడ్డీనము చిత్రమౌను ;

నింగి అంత సంచారము ;

కలుగును ప్రతి మనసుకు,

కృష్ణ -

ఉడ్డీనము చిత్రమౌను ; ||

============, ;

మనసేమో పాలపిట్ట,

అంత ఎత్తు ఎగర లేదు ;

నా మనసేమో పాలపిట్ట,

అంత ఎత్తు ఎగర లేదు ; ||

నెమలి వోలె పురి లేదు ;

నాట్యాల మురిపించ నిన్ను ;

పావురాయి కాను నేను,

కువకువలాడగ లేను ; ||

సీతాకోకను కాను ;

వన్నె రెక్కలు లేవు ;

చిన్ని పాలపిట్ట - మనసు ;

అంత ఎత్తు ఎగర లేదు ; ||

కనికరమును నీ చూపున ;

కురిపించుము, చాలును ;

పిసరంత నీ నవ్వు చాలు ; ||

;

ఉడ్డీనము చిత్రమౌను ;

నింగి అంత సంచారము ;

కలుగును ప్రతి మనసుకు,

కృష్ణ -

ఉడ్డీనము చిత్రమౌను ; ||

============, ;;

manasEmO paalapiTTa,

amta ettu egara lEdu ;

naa manasEmO paalapiTTa,

amta ettu egara lEdu ; ||

nemali wOle puri lEdu ;

nATyaala muripimca ninnu ; ||

paawurAyi kaanu nEnu,

kuwakuwalADaga lEnu ; ||

seetaakOkanu kaanu ;

wanne rekkalu lEwu ;

cinni pAlapiTTa - naa manasu ;

amta ettu egara lEdu ; ||

kanikaramunu nee cuupuna ;

kuripimcumu, caalunu ;

pisaramta nee nawwu caalu ; ..... ,

;

uDDInamu citramaunu ;

nimgi amta samcaaramu ;

kalugunu prati manasuku,

kRshNa - uDDInamu citramaunu ; ||

; &

శుభకృత్ సుమ గీత మాలిక - 24 ; రచయి3 = కుసుమ ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి