ఇంతింత సంతోషం - ప్రకృతిలోన,
ఎందుకని!? ఎందుకని!? ; ||
మేఘమాల పురిని విప్పి -
ఆడుతోంది నింగి నెమలి ; ||
అంబర సంబరముల గని ;
తిమిర గగన గని నుండి -
నక్షత్ర మణుల తళుకు నిధి ; ||
నెలవంక కురిసేను -
హర్ష శీతలమ్ముల -
సుతారంపు వెన్నెల ; ||
వంక వాగు ఝరుల వోలె -
ఇంతింత సంతోషం ; ప్రకృతిలో, ఎందుకని!? ; ||
ఇంత అంత హంగు పొంగు ;
అంతట హృత్ రంజనము ;
అల్లదే, వేణురవళి -
గాలిలోన తేలి వచ్చు - సాగి వచ్చు ;
కృష్ణ గీతి సమీరముల
డోలలూగు ఎల్లెడల ;
అందుకనే .....,
సృష్టిలోన ఇంతింత సంతోషం ;
ప్రకృతిలోన ఇంతింత సంతోషం ; ||
===================,
imtimta samtOsham - prakRtilOna,
emdukani!? ; emdukani!? ; ||
mEGamaala purini wippi -
ADutOmdi nimgi nemali ; ||
ambara sambaramula gani ;
timira gagana gani numDi -
nakshatra maNula taLuku nidhi ; ||
nelawamka kurisEnu -
harsha SItalammula -
sutaarampu wennela ; ||
wamka waagu jharula wOle -
imtimta samtOsham ;
prakRtilO, emdukani!? ; ||
imta amta hamgu pomgu ;
amtaTa hRt ramjanamu ;
alladE, wENurawaLi -
gaalilOna tEli waccu -saagi waccu ;
kRshNa geeti sameeramula
DOlaluugu elleDala ;
amdukanE .....,
sRshTilOna imtimta samtOsham ;
prakRtilOna imtimta samtOsham ; ||
;
శుభకృత్ సుమ గీత మాలిక - 30 ; రచయి3 = కుసుమ ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి