గగనమిపుడు పళ్ళెరము -
శ్రీహారతి పళ్ళెము ; ||
ప్రాక్ గగనము - అపరంజి పళ్ళెరము ;
తెలివెలుగులు కురిసేను ;
ఈ రీతిని కురిసేను - భళ్ళున -
తొలి పొద్దుకు ఎందుకయా, ఈ తొందర!!? ;
తెలిసె తెలిసె -
శ్రీకృష్ణస్వామి ఆగమన వేళ ఇది ;
వేణు రవళి మధు హవళి ; ||
తూర్పు చెట్టు తొర్ర లోన ;
దాచుకొనెను ఇంత కాంతి ;
తొలి పొద్దు శుభమస్తని -
నింగి కొంగు పట్టినది ; ||
ప్రాక్ గగనము - హారతి పళ్ళెమాయె ;
మేల్మి మిసిమి ప్రభలు కురిసె ;
తమసు తొలిగి, పెను మాయగ -
ప్రభా వీచి కదలసాగె ; ||
==============, ;
gaganamipuDu paLLeramu -
Sreehaarati paLLemu ; ||
praak gaganamu - aparamji paLLemu ;
teliwelugulu kurisEnu -
I reetini kurisEnu - bhaLLuna - ;
toli podduku emdukayaa, ee tomdara!!? ;
telise SreekRshNaswaami aagamana wELa idi ;
wENu rawaLi madhu hawaLi ; ||
tuurpu ceTTu torra lOna ;
daacukonenu imta kaamti ;
toli poddu Subhamastani -
nimgi komgu paTTinadi ; ||
praak gaganamu - haarati paLLemAye ;
mElmi misimi prabhalu kurise ;
tamasu toligi, penu maayaga -
prabhaa weeci kadalasaage ; ||
&
శుభకృత్ సుమ గీత మాలిక - 60 ; రచయి3 = కుసుమ ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి