వింతలెన్నొ తోచుచుండెనే,
నేడు - వింతలెన్నొ తోచుచుండెనే ; ||
శీత మలయసమీరము - ముంగురులను త్రోస్తున్నది ;
రాధ - ముంగురులను త్రోస్తున్నది ; ||
రాధా హృదయము యమున వాహిని -
తెడ్డు అలల తోయుచుండె ;
కృష్ణప్రేమ అనే తెడ్డు - ఆ అలలను తోయుచుండె ; ||
ఇంత మంచి దృశ్యాలను - వీక్షిస్తూ -
రతి అచ్చెరువందుచుండ ;
నవ్వులను చిందించును -
అయిదు పూల విలుకాడు* ; ||
&
అయిదు పూల విలుకాడు* = పంచబాణహస్తుడు = మన్మధుడు ;;
================ ;
wimtalenno tOcucumDenE,
nEDu - wimtalenno tOcucumDenE ; ||
SIta malayasameeramu - mumgurulanu trOstunnadi ;
raadha - mumgurulanu trOstunnadi ; ||
raadhaa hRdayamu yamuna waahini -
teDDu alala tOyucumDe ;
kRshNaprEma anE teDDu - aa alalanu tOyucumDe ; ||
imta mamci dRSyaalanu - weekshistuu -
rati acceruwamducumDa ;
nawwulanu cimdimcunu -
ayidu puula wilukADu* ; ||
&
ayidu pUla wilukADu* = pamcabANahastuDu / manmadhuDu ;
;
శుభకృత్ సుమ గీత మాలిక - 45 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ; FB ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి