3, మే 2022, మంగళవారం

రాధకు మక్కువ

రేయి నింగి నల్లన - యమున నీరు నల్లన ;

ముద్దు కన్న మేను రంగు నల్లన ;

నలుపు వన్నె అంటేనే - రాధకెటుల మక్కువ అయె!? ;  ||

అల్లనల్లనదే అదే - వెలిసినది నెలవంక ;

ఇల మీద ఇక్కడనే - వెలసె కొత్త చంద్రవంక ;

ఇదేమి వింత, చెప్పరే, చెలియలార ; ||

;

చెక్కిలిపయి వేలు ఉంచి, అంత యోచనా!? ;

రాధిక విప్పేయగలదు, ఇందులోని చిక్కు ముడిని ; ||

క్రిష్ణుని కడ వనిత - చాల -

నేర్చె కదా పొడుపు కథలు -

చెప్పింది ఇట్టే - ఆ ప్రశ్న సమాధానం ; ||

;

ముద్దు కృష్ణ చిరునవ్వే ;

భువి పైన ఉన్న నెలవంక ;

ముత్తు క్రిష్ణ చిరునగవే -

వెన్నల నగ - నెలవంక ; ||

అయ్యారే చప్పట్లు, చమత్కార జవాబుల ;

గడుసు ముదిత రాధమ్మకు ;

మన గడుసు ముదిత రాధమ్మకు ; ||

======================,

rEyi nimgi nallana - yamuna neeru nallana ;

muddu kanna mEnu ramgu nallana ; ||

nalupu wanne amTEnE -

raadhakeTula labhyamaaye!? ||

allanallanadE adE - welisinadi nelawamka ;

ila meeda ikkaDanE - welase kotta camdrawamka ;

idEmi wimta, cepparE, celiyalaara ; ||

;

cekkilipayi wElu umci, amta yOcanA!? ;

rAdhika wippEyagaladu, imdulOni cikku muDini ; ||

krishNuni kaDa wanita - caala -

nErce kadaa poDupu kathalu -

ceppimdi iTTE - aa praSna samAdhAnam ; ||

;

muddu kRshNa cirunawwE ;

bhuwi paina unna nelawamka ;

muttu krishNa cirunagawE -

wennala naga - nelawamka ; ||

ayyArE cappaTlu, camatkAra jawAbula ;

gaDusu mudita raadhammaku ;

mana gaDusu mudita rAdhammaku ; ||

&

song  = 33 ; శుభకృత్ సుమ గీత మాలిక -  33 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి