యమునలోన అలలు ;
తీరైన పంక్తులు ;
వెన్నెల లిపి ఇచట ;
వ్రాస్తున్నది ఎవ్వరో!? ; ||
పలు పలు పలు పద్యాలు ;
పలు కావ్యాలు, ప్రబంధాలు ;
విరచించున దెవ్వరో!?
మరి, పఠియించున దెవ్వరో!? ; ||
యమున రేవు, వ్రేపల్లె సీమలిటుల ;
ప్రణయ సుభగ మనోహరం ;
స్వచ్ఛ ప్రేమ నెలకొన్న ;
ప్రతి హృది బృందావనియే ;
పౌర్ణమీ చంద్రికలను ;
చదువు హక్కు వారిదే ; ||
================,
yamunalOna alalu ;
teeraina pamktulu ;
wennela lipi icaTa ;
wraastunnadi ewwarO!? ; ||
palu palu palu padyaalu ;
palu kaawyaalu, prabamdhaalu ;
wiracimcuna dewwarO!?
mari, paThiyimcuna dewwarO!? ; ||
yamuna rEwu,
wrEpalle seemaliTula ; ||
praNaya subhaga manOharam ;
swacCa prEma nelakonna ;
prati hRdi bRmdaawaniyE ;
paurNamee camdrikalanu ;
caduwu hakku waaridE ; ||
&
song = 31 ;; శుభకృత్ సుమ గీత మాలిక - 31 ; రచయి3 = కుసుమ ; ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి