27, ఫిబ్రవరి 2023, సోమవారం

చంద్రశిలలు కరుగుతున్నవి -131

 నానా విధముల అలజడి ; 

నిండు జాబిలి పయనాలకు ; 

అడ్డు తగులుతూ ; 

నింగిలోన కరిమబ్బులు ; || 

2] వెన్నెల మోమును చాటేసినది ; 

ఈ అమవస నిశిలో తీరం చేరగ ; 

అరరే, ఈ ఎగసే ఈ కెరటాలకు, 

ఎంతటి తపనో చూడండి ; || 

3] ఈ నిశి రేతిరిలోన రాధిక ; 

ఆసీన ఐనది, శిలా తల్పము మీద ; 

చంద్రశిలా తల్పము మీద ; || 

అల్లదె, మురళీరవళీ పరంపరలు - 

క్రిష్ణ రాగముల గ్రోలుతు, 

చంద్రశిలలు కరుగుతున్నవి, 

రాధమ్మ, ఇక లేచి రావమ్మా ;  ;  

==============,

camdraSilalu karugutunnawi ;- song 131 ;- 

naanaa widhamula alajaDi ; 

nimDu jaabili payanaalaku ; 

aDDu tagulutU ; 

nimgilOna karimabbulu ; || 

2] wennela mOmunu caaTEsinadi ; 

ee amawasa niSilO tIram cEraga ; 

ararE, I egasE ee keraTaalaku, 

emtaTi tapanO cUDamDi ; || 

3] ee niSi rEtirilOna raadhika ; 

aaseena ainadi,  talpamu meeda ;   

camdraSilaa talpamu meeda ;  ||

allade, muraLIrawaLee paramparalu - 

krishNa raagamula grOlutu, 

camdraSilalu karugutunnawi, 

raadhamma, ika lEci raawammaa ;  ; 

&  song = చంద్రశిలలు కరుగుతున్నవి ;- 131 ;

శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; 

26, ఫిబ్రవరి 2023, ఆదివారం

మంచెపైన దవనం పడక -130

 చిలుకతేజి, మన్మధుడు - చెరుకు విల్లు ఎత్తెను ;

ఇక్షు వింటికిప్పుడు తేనె పానీయమెంతో దొరికినది ;

క్రిష్ణరాధ ప్రణయ తేనె పానీయం దొరికినది ; ||

పొంచి చూచు మరువము*,

               మంచె పయిన దవనము* ;

పరచి ఉన్న పడక ఇది, మెచ్చుకొనెను రతీదేవి ; ||

రాధ ప్రణయ ఆరాధన - యుగ యుగముల మాధురి ;

మాలతీ మాధవముల అనుబంధం పందిరి ;

గోపీ కృష్ణ గాధలకు ఎప్పుడూ, 

                వనులలోన వ్యాహ్యాళి ;

అనునిత్యం బృందావని విరి క్రీడల వ్యాహ్యాళి ;|| 

& notes ;- [దవనం* & మరువం; Sanskrit= दमनक ;

================================ ,

mamce paina dawanam paDaka -130 ;- 

cilukatEji, manmadhuDu - 

                ceruku willu ettenu ;

ikshu wimTikippuDu - 

                tEne pAniiyamemtO dorikinadi ;

krishNarAdha praNaya

                tEnepAnIyam dorikinadi ;||

pomci cUcu maruwamu - 

                mamce payina dawanamu ;

paraci unna paDaka idi

                meccukonenu ratIdEwi ; ||

rAdha praNaya ArAdhana

                yuga yugamula mAdhuri ;

mAlatI mAdhawamula anubamdham pamdiri ;

gOpI kRshNa gaadhalaku eppuDU 

                wiri wanulalOna wyAhyALi ;

bRmdAwani wiri krIDalalO

                anunityam wyAhyALi ; || 

& notes ;- [దవనం *& మరువం;- Sanskrit = दमनक= damanak ; 

Marathi=दवणा,  Kannada=ದವನ ; 

Tamil=மரிக்கொழுந்து,தவணம்; &

Dhavanam;-సుగంధమొక్క-శాస్త్రీయనామం= Artemisia pallens ; 

Krishna rAdha - 130 songs 

;


& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- God krishna songs-130 ; 

song = మంచెపైన  దవనం పడక -130 ;

25, ఫిబ్రవరి 2023, శనివారం

సముల్లాస వ్యాప్తి-129

సంపెంగల ఊసులతో - కన్నియ హృది తన్మయి ;

ఇంపెగయగ ఒడి నిండెను పూలమాలలు ; ||

మాలి క్రిష్ణ రావోయీ!

తోటమాలి క్రిష్ణయ్యా రావోయీ!

బృందావన భద్రత విధి నీదేను ;

నీ శుభాగమనము, రాకడ -

ఉల్లాసము పరివ్యాప్తి ;  

పరిసరముల సముల్లాసము పరివ్యాప్తి ; 

జాలమేల, రావయ్యా - 

నీలమోహనాంగ, వేగిరమే రావయ్యా ; ||

ఈ హరిత ఉపవనముల -

నీ మురళీ రాగవరములు -

మృదుతరముగ జాలువారనీ ; ||

కుహు కుహూ గానములను - 

తమ గళముల నింపుకుని,

వేచిఉండె కోకిలలు ;

పరిమళలు నింపుకున్న -

లతాంకురములు వేచిఉండె ; ||

ప్రణయ సుధలు నింపుకున్న -

మణికలశ మానసముతొ,

వేచిఉండె రాధమ్మ!

రావోయీ కృష్ణయ్యా ; ||

====================== ,

samullaasa wyaapti ;- 

sampemgala UsulatO - kanniya hRdi tanmayi ;

impegayaga oDi nimDenu puulamAlalu ; ||

maali krishNa rAwOyI!

tOTamAli krishNayyA rAwOyI!

bRmdaawana bhadrata widhi needEnu ;

nee SuBAgamanamu, raakaDa -

ullaasamu pariwyaapti ;  

parisaramula samullaasamu pariwyaapti ; 

jaalamEla, raawayyA - 

nIlamOhanAmga, wEgiramE raawayyA ; ||

ee harita upawanamula -

nee muraLI raagawaramulu -

mRdutaramuga jaaluwaaranI ; ||

kuhu kuhuu gaanamulanu - 

tama gaLamula nimpukuni,

wEciumDe kOkilalu ;

parimaLalu nimpukunna -

lataamkuramulu wEciumDe ; ||

praNaya sudhalu nimpukunna -

maNikalaSa maanasamuto,

wEciumDe raadhamma!

raawOyI kRshNayyA ; ||

& part-2 ;- సముల్లాస వ్యాప్తి ;

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; God Krishna ;- songs - 129 ;

24, ఫిబ్రవరి 2023, శుక్రవారం

సమృద్ధిగ ఉల్లాసం - 128

"కలల పూలు" - సుగంధాలు వెదజల్లెను ;

మనసు తోటనిండా ఉల్లాసం ;  

సమృద్ధిగ తోట ఎదను -

ఉల్లమలరు ఉల్లాసం -

సముల్లాసం ఉల్లాసం ; ||

సౌగంధ పూబాల -

మధుర తావులెగసెను ;

పారిజాత మాలికలు -

రాధ కొంగు నింపెను ;

తోట - రాధ కొంగును నింపెను ; ||

కృష్ణాధర వేణురవళిని -

గాలి పైట నింపుకుని -

రాధమ్మకు - ఎద మీటగ -

కొత్త పాటలిచ్చెను -

రాధమ్మకు - బహుమతిగా -

చల్లగాలి, కొత్త పాటలిచ్చెను ; ||  

===================== ,

part-1 ;- samRddhiga ullAsamkalala pUlu -128 ;

kalala puulu - sugamdhaalu wedajallenu ;

manasu tOTanimDA ullaasam ;  

samRddhiga tOTa edanu -

ullamalaru ullaasam -

samullaasam ullAsam ; ||

saugamdha pUbAla -

madhura taawulegasenu ;

paarijaata maalikalu -

raadha komgu nimpenu ;

tOTa - raadha komgunu nimpenu ; ||

kRshNaadhara wENurawaLini -

gaali paiTa nimpukuni -

raadhammaku - eda meeTaga -

kotta paaTaliccenu -

raadhammaku - bahumatigaa -

callagaali, kotta paaTaliccenu ; ||  

& part- 1 ;-సమృద్ధిగ ఉల్లాసం /

 కలల పూలు ;- పాట -  128 ;

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 - God krishna songs ;

మురళికి పల్లవి దొరికినది -127

 స్వరమేళన సామ్రాజ్యాలు -

ఇవే ఇవే ఇవే ;

ఉల్లములు ఉప్పొంగగ,

ఉల్లాసము సృష్టి నిండ ; ||

రాధ ప్రేమ - 

మధుర భావముల ముల్లె ;

సరిగమలు శతకోటి -

జగతి వేణువాయెను ; ||

సంగీతము శృతి నిధి ;

గీతములు లయ "గని" ;

కన్నె మనసు కనుగొనిన -

వేణువునకు మేలుకొలుపు ; ||

క్రిష్ణయ్యా, తెలుసుకొనుము,

అంబుజాక్షి కనుకొలుకుల -

జాలువారు వలపులు -

నీ మురళికెపుడు -

తొలి పల్లవి, చరణాలు ; ||

====================== ,

muraLiki pallawi dorikinadi ;- song ;- 

swaramELana saamrAjyaalu -

iwE iwE iwE ;

ullamulu uppomgaga,

ullaasamu sRshTi nimDa ; ||

raadha prEma - 

madhura BAwamula mulle ;

sarigamalu SatakOTi -

jagati wENuwaayenu ; ||

samgeetamu SRti nidhi ;

gItamulu laya "gani" ;

kanne manasu kanugonina -

wENuwunaku mElukolupu ; ||

krishNayyaa, telusukonumu,

ambujaakshi kanukolukula -

jaaluwaaru walapulu -

nee muraLikepuDu -

toli pallawi, caraNAlu ; ||

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- God Krishna songs -127 ;

పాట ;- మురళికి పల్లవి దొరికినది ;

మా మనసే మందిరము -126

కనురెప్పలాగ రక్షించే పద్మనాభుడు ;

అండదండగా - మనకు ఉండినాడయా! ||  

జాగరూకత తోడ ఎత్తిపట్టినట్టి - 

- ఎల్లరికీ ఎత్తిపట్టినట్టి - 

పుష్పఛత్ర ఛాయలలో - 

మన అందరి భద్రత ఉన్నది ;

భరోసా ఆతడే శ్రీకృష్ణుడు ; || 

పార్ధసారధి - గీతకారుడు ;

శ్రీక్రిష్ణ స్వర్ణసన్నిధికి,

మనము సాగుదాం!  

మనమందరమూ సాగుదామయా ; ||

క్రిష్ణ పూజ కొఱకు, 

భక్తి కీర్తనా సేవలు ;

ఇవే, భక్తి కీర్తనా సేవలు,

స్వామి, స్వీకరించుము ; 

మనము* మందిరమాయె ;

మా మనము* మందిరమాయెను ; || 

[ *మనము = మనస్సు ] ; 

======================== ,

maa manasE mamdiramu ;- song =

kanureppalaaga rakshimcE padmanABuDu ;

amDadamDagaa - manaku umDinADayA! || 

jaagarUkata tODa ettipaTTinaTTi - 

- ellarikI ettipaTTinaTTi - 

pushpaCatra CAyalalO - 

mana amdari bhadrata unnadi ;

BarOsA AtaDE SrIkRshNuDu ; || 

paardhasaaradhi - gItakAruDu ;

SrIkrishNa swarNasannidhiki,

manamu saagudaam!  

manamamdaramuu saagudaamayA ; ||

krishNa puuja ko~raku, 

bhakti keertanaa sEwalu,

iwE, bhakti keertanaa sEwalu,

swAmi, sweekarimcumu ; 

manamu* mamdiramaaye ;

mA manamu* mamdiramaayenu ; || 

[ *manamu = manassu ] ; 

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- God Krishna songs -126 ;  మా మనసే మందిరము ;

23, ఫిబ్రవరి 2023, గురువారం

ఓలి ధనం - నీ గానం -125

అల్లరికి హద్దులేల - అంటాడు కృష్ణుడు ;

నీదు వేణు గాన మాధురిని ఈయవయ్య క్రిష్ణయ్యా!

పిల్లంగ్రోవి రాగము కట్నం, శుల్కం ; 

మాకు "సంగీతం - ఓలి" ఇస్తే చాలును,

నీ అల్లరి నెటులో మేము భరియిస్తాము ; ||

మద్దిచెట్లు కూల్చినావు,

రక్కసులను అణచినావు ;

ఇంత ఘనుడవు నీవు,

ఏమి తెలియని వాని వలెనె ;

నటియిస్తూ ఉంటావు ; || 

'నోట వేలు చీకుతున్న -

చిన్ని ముద్దుబాలుని వలె -

నటియిస్తూ ఉంటావు ;

నటనాలు చాలునులే,

వెండి గిన్నెలోన బువ్వ తెచ్చినామయ్యా,

బొజ్జ నిండూ నీవు పెరుగుబవ్వలను తినరా 

మురళి చేతపట్టరా,

*ఓలి ఈయరా! రాగమాలికల ఓలినీయరా!

[ఓలి = కన్యాశుల్కం] & + ;- 

notes ;- [Oli = *ఓలి =  marriage portion, money paid by a bridegroom to the parents of a bride ; కన్యాశుల్కం ; & + = Dowry ;- ఓలి, ఉంకువ, హరణము, యౌతౌకము ; 

======================== ,

Oli dhanam - nee gaanam -

            [God krishna song ;- 125 ] ;- 

allariki haddulEla - amTADu kRshNuDu ;

needu wENu gaana maadhurini eeyawayya krishNayyA!

pillamgrOwi raagamu kaTnam, Sulkam ; 

maaku "samgeetam - Oli" istE caalunu,

nee allari neTulO mEmu BariyistAmu ; ||

maddiceTlu kuulcinaawu,

rakkasulanu aNacinAwu ;

imta ghanuDawu neewu,

Emi teliyani waani walene ;

naTiyistU umTAwu ; || 

'nOTa wElu ceekutunna -

cinni muddubaaluni wale -

naTiyistU umTAwu ;

naTanaalu caalunulE,

wemDi ginnelOna buwwa teccinaamayyA,

bojja nimDua neewu perugubawwalanu tinarA 

muraLi cEtapaTTarA,

*Oli eeyarA! raagamaalikala OlineeyarA!

[Oli = kanyASulkam] ; 

 & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 - song-125 ;- ఓలి ధనం - నీ గానం ;

గుంభనాల గోవిందుడు-124

వంపు సొంపు మావి కొమ్మ - 

చిగురు కోరె కోయిలమ్మ ; 

మధురమైన కృష్ణ వేణు గానమేల - 

శ్రవణములకు సోకలేదు - 

అనుచు రాధ చిన్నబోవుచున్నదిరా - 

రావోయీ కన్నయ్యా ; 

మాచిన్నారి బాలక్రిష్ణ ; || 

యమున మోవి అలలను స్పృశియించెను మేఘము 

శ్రావణఋతు లహరికలకు కలల మేళాలు, 

కా-వలసినన్ని కలబోతలు దొరికినవి ; 

నీలమోహన క్రిష్ణ, జాగు మాని, రావయ్యా ; ||

నీదు రాకయే రాధకు బహు సాంత్వన కదా, 

మరి, నీకు తెలియనిదా, ఈ సంగతి, 

సరి కొత్తది వలె - ముఖకవళిక పెడ్తావు నీవు, 

భలే భలే, భళిరా - అల్లరి మానేసి త్వరగ, 

ముద్దరాలి ముంగిట, నీ రాసకేళీ రాసలీల -

వైభవాల రంగవల్లి వేయవయ్య, 

వ్రేపల్లియ గారాబు నందనుడా, 

గుంభనాల గోవిందుడా ; || 

==================== ,

God Krishna songs ;- 

gumBanAla gOwimduDu ;- 124 ;- 

waMpu sompu maawi komma - 

ciguru kOre kOyilamma ; 

madhuramaina kRshNa wENu gaanamEla - 

SrawaNamulaku sOkalEdu - 

anucu raadha cinnabOwucunnadiraa - 

raawOyee kannayyaa ; 

maacinnaari baalakrishNa ; || 

yamuna mOwi alalanu spRSiyimcenu mEGamu ; 

SrAwaNaRtu laharikalaku kalala mELAlu, 

kaa-walasinanni kalabOtalu dorikinawi ; 

neelamOhana krishNa, jaagu maani, raawayyaa ; ||

needu raakayE raadhaku bahu saamtwana kadaa, 

mari, neeku teliyanidaa, I samgati, 

sari kottadi wale - muKakawaLika peDtaawu neewu, 

BalE bhalE, BaLirA - allari mAnEsi twaraga, 

muddaraali mumgiTa, nee raasakELI raasaleela -

waibhawaala ramgawalli wEyawayya, 

wrEpalliya gaaraabu namdanuDA, 

gumBanAla gOwimduDA ; || 

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- గుంభనాల గోవిందుడు-124 ; 

గీతబోధకుడు-123

 గీతబోధకునికి మంగళహారతి ;

భగవత్ గీతకారునికి - శుభ మంగళ హారతి ; ||

బహు నిగూఢమ్ములు కృష్ణలీలలు - శ్రీకృష్ణలీలలు ;

ఇహ పరమ్ములకు వేసిన చిత్రమైన వంతెనలు ;

కృష్ణమాయలు, శ్రీకృష్ణమాయలు ; || 

గీతలెన్నొ గీయగలడు - గీత గుట్టు తెలిసినోడు ; 

వక్ర గీతలను - రంగవల్లికలుగ దిద్దగలడు ; ||

============================== , 

geetabOdhakuDu ;- God krishna songs ;- 

geetabOdhakuniki mamgaLahaarati ;

Bagawat gItakAruniki, SuBa mamgaLa hArati ; ||

bahu nigUDhammulu kRshNaleelalu - 

SrIkRshNa leelalu ;

iha parammulaku wEsina citramaina wamtenalu ;

kRshNamAyalu, SreekRshNamAyalu ; || 

gItalenno gIyagalaDu, gIta guTTu telisinODu ;  

wakra gItalanu - ramgawallikaluga diddagalaDu ; || 

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- song-123 ;- గీతబోధకుడు-123 ;

21, ఫిబ్రవరి 2023, మంగళవారం

ఆనవాళ్ళు ఇవేనండీ ;-122

బృందావనమ్ములోన, 

            ఏ మల్లెపొదల మాటుననో -

ఎక్కడనో నక్కిఉండె గోపాలుడు

               మన గోవిందుడు ;|| 

చెంగల్వల పూలదండ గళమందున ధరియించెను ;

విరితావుల గుబాళింపు - సువాసనల ఆనవాలు - 

ముక్కుపుటములకు వరములు - 

           'మూ చూసీ, ట్టే పట్టేద్దాము

                      నల్లవాని నిపుడే, ఇట్టే పట్టేద్దాము ; || 

పగడాల పెదవుల మిసమిసలు, 

               దృక్ తారల తళతళలు ;

కిలకిలల నవ్వులు, తెలి దంత రోచిస్సులు -

చాల కొండగురుతులు - ఇట్టె పట్టేద్దాము ; || 

ఇట్టె ఇట్టె, చిటికెలోన దొరుకుతాడు అనుకుంటిమి ;  

ఎంతకినీ పట్టలేకున్నాము, ముద్దుపట్టిని,

యశోదమ్మ ముద్దుపట్టిని, ఇది ఏమి చోద్యమో!? ;  

ఇట్టె వాడు దొరుకుతాడు ... అనుకుంటే పొరపాటు ;

మోకు తాళ్ళు, సంకెలలు అక్కరలేదమ్మా! ;

వినయ విధేయతలల్లికల పెనవేసిన దారమ్ములు ;

"భక్తి అనే చిట్టిపట్టు దారమింతె చాలు ;

దొరుకుతాడు, వాడు భక్తసులభుడు ; 

తెలుసుకోండి ఓయమ్మా! ; ||

============================ ,  

komDagurtulu, AnawaaLLu iwEnamDI ;-  

bRmdaawanammulOna, 

           E mallepodala mATunanO -

ekkaDanO nakkiumDe, gOpAluDu

           ana gOwimduDu ; || 

cemgalwala pUladamDa -

           gaLamamduna dhariyimcenu ;

wiritaawula gubALimpu - 

             suwaasanala aanawaalu - 

mukkupuTamulaku waramulu -

           'mU cUsi',  iTTE paTTEddAmu ;

      nallawaaninipuDE

               iTTE paTTEddAmu ; || 

pagaDAla pedawula misamisalu -

           dRk taarala taLataLalu ;

kilakilala nawwulu, teli damta rOcissulu -

caala komDagurutulu - iTTe paTTEddAmu ; || 

iTTe iTTe, ciTikelOna dorukutADu anukumTimi ;  

emtakinee paTTalEkunnaamu, muddupaTTini,

yaSOdamma muddupaTTini, idi Emi cOdyamO!? ;  

iTTe wADu dorukutADu ... anukumTE porapATu ;

mOku tALLu, samkelalu akkaralEdammA! ;

winaya widhEyatalallikala  -

           penawEsina dArammulu ;

"bhakti anE ciTTipaTTu dAramimte cAlu ;

dorukutADu, wADu bhaktasulabhuDu ; 

telusukOMDi OyammA! ; ||

&  శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  ఆనవాళ్ళు ఇవేనండీ ;-122 ;- part -2 ; & + ;- 

[& + ;- part-1 =  కొండగుర్తులు, ఆనవాళ్ళు -121 ;- ఆ చివరన నక్కిఉండె గోవిందుడు ; 

దుడుకు గోపాలుడు ; దుందుడుకు గోపాలుడు ]

కొండగుర్తులు, ఆనవాళ్ళు -121

ఆ చివరన నక్కిఉండె గోవిందుడు ; 

దుడుకు గోపాలుడు ; దుందుడుకు గోపాలుడు ; 

ఆచితూచి అడుగు వేసి పట్టండమ్మా!  ; || 

కస్తూరీతిలకుడు, బర్హిపింఛధారి - 

తన చిట్టి నాసికకు ముత్యాల నత్తులలో - 

వెన్నెలమ్మ - మిసిమి కాంతి శోభ చెరగుతోంది ; ||

క్రిష్ణమూర్తి శ్రవణమ్ముల రత్నాల  కుండలముల -

వెన్నెలమ్మ - మిసిమి శోభ చెరిగి పోయుచున్నది ;

సరిగెచీర చెరగులలో ఒడిసి పట్టండమ్మా, 

గోవర్ధనగిరిధారిని పట్టండమ్మా : || 

చక్కనైన *కొండగుర్తులిన్ని దొరకెను ; 

ధేనువుల దొరగారిని ఇట్టె పట్టేద్దాము ; || 

ఇట్టె ఇట్టె, చిటికెలోన దొరుకుతాడు అనుకుంటిమి ;  

ఎంతకినీ పట్టలేకున్నాము ముద్దుపట్టిని ; 

యశోదమ్మ ముద్దుపట్టిని, ఇది ఏమి చోద్యమో!? ; ||

&

[ *కొండగుర్తులు - ఆనవాలు  - జాడ = traces ] ; 

========================================= ,

A ciwarana nakkiumDe gOwimduDu ; 

duDuku gOpAluDu ; dumduDuku gOpAluDu ; 

AcitUci aDugu wEsi paTTamDammA!  ; || 

kastuureetilakuDu, barhipimCadhAri - 

tana ciTTi naasikaku mutyaala nattulalO - 

wennelamma - misimi kAmtiSOBa ceragutOmdi ; ||

krishNamUrti SrawaNammula -

                  ratnAla  kumDalamula -

wennelamma - misimi SOBa cerigi pOyucunnadi ;

sarigeceera ceragulalO oDisi paTTamDammA, 

gOwardhanagiridhArini paTTamDammA : || 

cakkanaina komDagurtulinni dorakenu ; 

dhEnuwula doragaarini iTTe paTTEddAmu ; || 

iTTe iTTe, ciTikelOna dorukutADu anukumTimi ;  

emtakinee paTTalEkunnAmu muddula paTTini ; 

yaSOdamma muddupaTTini, idi Emi cOdyamO ; ||

; &  శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  కొండగుర్తులు, ఆనవాళ్ళు -121 ;- పాట - part 1 ;- 

19, ఫిబ్రవరి 2023, ఆదివారం

ముగ్గురి ఒప్పులకుప్పలు-120

రత్నసింహాసనములు - 

రాధ నవ్వు వెలుగులు ;

ఈ - కొత్త కాంతి వెలుగులను ;

చందమామ జత చేసెను - 

వెన్నెలమ్మకు, తన వెన్నెలమ్మకు ; ||

చంద్రికలు ఆడేను ఒప్పులకుప్పలు ;

యమున అలలు - జత చేరెను -

హంగు పొంగుగా, వన్నె మీరగా ;

చలిగాలుల, పొగమంచుల పరదాలకిప్పుడు -

వనిత నవ్వు చాందినీలు విప్పారుచున్నవి ;

క్రిష్ణయ్యా! నీవంతిక*, మందగొండితనమువీడి -

నీదు, మధురాధర దరహాస లహరి ;

అందించుమయా, విప్పార్చి పరుచుమయా ; ||

[*[*నీ వంతు + ఇక = నీ వంతిక ] ;

==================================== ,

ratnasim haasanamulu - 

raadha nawwu welugulu ;

ee - kotta kaamti welugulanu ;

camdamaama jata cEsenu - 

wennelammaku, tana wennelammaku ; ||

camdrikalu ADEnu oppulakuppalu ;

yamuna alalu - jata cErenu -

hamgu pomgugaa, wanne meeragaa ;

caligaalula, pogamamcula paradaalakippuDu -

wanita nawwu caamdineelu wippaarucunnawi ;

krishNayyA! nee wamtika, mamdagoMDitanamuwIDi - 

needu, madhuraadhara darahaasalahari ;

amdimcumayA, wippArci, parucumayaa ; ||

[*nI wamtu + ika = nee wamtika ] ;

God Krishna Radha Songs - 120 




& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;-  

[అలలు, వెన్నెల, రాధ నవ్వులు ] =  ముగ్గురి ఒప్పులకుప్పలు-120 ;

రసరమ్యతలకు సార్ధకత-119

రమణికి జోడీ క్రిష్ణమోహనం ;

రాధా రమణికి జోడీ క్రిష్ణమోహనం ;

సౌమ్య సుందరం, బహుళ రమ్యమిది - 

వీక్షణమ్ములు హరివిల్లులయె ; ||

ఈ, అరవిందదళ నేత్రుల జంటను 

చూచేటందుకు, విశాలత్వమును పొందెను -

మా భక్తులందరి కన్నుజంటలు -

విశాలత్వమును పొందెను ; ||

మల్లెలు, మొల్లల విరులకు మెలకువ వచ్చెను ;

మిన్నులకంటెను సోయగమ్ముల వెల్లువ ;

రసరమ్యతలకు నేడు సార్ధకత ; ||

======================= ,  

rasaramyatalaku sArdhakata-119 ;- 

ramaNiki jODI krishNamOhanam ;

rAdhA ramaNiki jODI krishNamOhanam ; 

saumya sumdaram, bahuLa ramyamidi - 

weekshaNammulu hariwillulaye ; ||

ee, arawimdadaLa nEtrula jamTanu 

cuucETamduku, wiSaalatwamunu pomdenu -

maa bhaktulamdari kannujamTalu ;

wiSaalatwamunu pomdenu ; ||

mallelu, mollala wirulaku melakuwa waccenu ;

minnulakamTenu sOyagammula welluwa ;

rasaramyatalaku nEDu saardhakata ; || 

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; రసరమ్యతలకు సార్ధకత-119 ;

తేనెల మాటల ఊటలు-118

 సదా నీ ధ్యానమేరా, గోవిందా!

సాదా ఊహలు చిప్పిలు మనసు రాధది,

ఎరుకయే కదా, నీ మనసునకు ; ||

"ఒట్టు, తప్పక వస్తానంటావు '  ;

ఊటగ తేనెల మాటల నాలుక నీదిలె ;

తెలియని ప్రియమణి రాధిక మాత్రం -

అట్టే నిలిచి చూచుచున్నది,

నీకై ఎదురు చూస్తూ ఉన్నది తాను ;  ||

గట్టులు, పుట్టల వెంట తిరుగుతూ, 

ముద్దరాలిని మరిచిపోకుమా!

వైలమె రారా, చిలిపి కృష్ణుడా ||

===================================== ,

tEnela mATala UTalu - 118 ;-  

sadaa nI dhyAnamErA, gOwimdA!

saadaa uuhalu cippilu manasu rAdhadi,

erukayE kadaa, nee manasunaku ; ||

"oTTu, tappaka wastaanamTAwu '  ;

UTaga tEnela mATala naaluka needile ;

teliyani priyamaNi raadhika maatram -

aTTE nilici cUcucunnadi,

nIkai eduru cUstuu unnadi taanu ;  ||

gaTTulu, puTTala wemTa tirugutuu, 

muddaraalini maricipOkumA!

wailame raarA, cilipi kRshNuDA ||

శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- తేనెల మాటల ఊటలు-118

సుగంధముల ఉనికి -117

అనంగ రాగ రాగిణులు ;

మురళి గృహము చేరినవి ;

రాధ కినుక, చిరు అలుకలు ; 

గొప్ప వేడుకాయెనులే ;

రాగములకు -

గొప్ప వేడుకాయెనులే ; || 

జవ్వని పోకడలు మెండు ;

అగరు తావు లెగసేను ;

నును లేత పరిమళముల -

ఉనికి ఇటుల తెలిసెను ;

మురళీ ప్రియరాగములకు -

పరిమళముల ఉనికి - 

ఇటుల తెలిసినది ; ||  

===================== ,

sugamdhamula uniki - 117 ;- 

anamga raaga raagiNulu ;

muraLi gRhamu cErinawi ;

raadha kinuka, ciru alukalu ; 

goppa wEDukaayenulE ;

raagamulaku -

goppa wEDukaayenulE ; || 

jawwani pOkaDalu memDu ;

agaru taawu legasEnu ;

nunu lEta parimaLamula -

uniki iTula telisenu ;

muraLI priyaraagamulaku -

parimaLamula uniki - 

iTula telisinadi ; || 

 సుగంధముల ఉనికి - 117 ;

మంచు అద్దం - 116

పౌర్ణిమ యామినికి, నీలి యమున అలల ఉధృతి ;

రంజుగ పోటీ సాగుతున్నది, చూడండీ ; || 

నీలి మబ్బుల - విశాల రెక్కల

రేయి నిడివిగా సాచినది ; 

చక్కని వెన్నెల బంగరు పక్షి ; 

సాగుతున్నది దిశల అవధులకు ; ||

పరుగులు తీస్తూ - పడతి రాధిక ;

జిలుగు పావడా, వలువల పైన -

తన అందము మరింత ఇనుమడించగా ;

మురిసిపోవుచూ సాగుతున్నది ;

శరత్ చంద్రిక -

మురిపాలు పోవుచూ సాగుతున్నది ; ||

యమున అలలలో - తళుకు రాగిణులు ; 

క్రిష్ణ ప్రియసఖి - వస్త్రములందున ;

సరిగంచు బుటాల జిగినీ మెరుపుల చేరసాగినవి ; ||

పున్నమి చంద్రిక - ఝరీ తరంగిణి -

ఇరువురి నడుమను పోటీ ఇపుడు -

బహు, రంజురంజుగా సాగుతున్నది, చూడండీ ; ||

======================,

paurNima yaaminiki, neeli yamuna alala udhRtammunaku ;

ramjuga pOTI saagutunnadi, cUDamDI ; || 

daTTamaina neelaala 

nIli mabbula wiSAla rekkala -

rEyi niDiwigA sAcinadi ; 

cakkani wennela bamgaru pakshi ; 

saagutunnadi diSala awadhulaku ; ||

parugulu teestuu - paDati raadhika ;

jilugu paawaDA, waluwala paina -

tana amdamu marimta inumaDimcagA ;

murisipOwucU saagutunnadi ;

Sarat camdrika -

muripaalu pOwucU saagutunnadi ; ||

yamuna alalalO - taLuku raagiNulu ; 

krishNa priyasaKi - wastramulamduna ;

sarigamcu buTAla jiginee merupula cErasaaginawi ; ||

punnami camdrika - jharI taramgiNi -

iruwuri naDumanu pOTI ipuDu -

bahu, ramju ramjugaa saagutunnadi, cUDamDI ; ||

&  శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- మంచు అద్దం ;- 116 ;

రంజుగ పోటీ - 115

పౌర్ణిమ యామినికి, 
నీలి యమున -అలల ఉధృతికి  ;

రంజుగ పోటీ సాగుతున్నది, చూడండీ ; || 

నీలి మబ్బుల విశాల రెక్కలు - నిడివిగ సాచెను ; 

చక్కని వెన్నెల బంగరు పక్షి ; 

సాగుతున్నది దిశల అవధులకు ; ||

పరుగులు తీస్తూ - పడతి రాధిక ;

జిలుగు పావడా, వలువల పైన -

తన అందము మరింత ఇనుమడించగా ;

మురిసిపోవుచూ సాగుతున్నది ;

శరత్ చంద్రిక - 

మురిపాలు పోవుచూ సాగుతున్నది ; ||

యమున అలలలో - తళుకు రాగిణులు ; 

క్రిష్ణ ప్రియసఖి - వస్త్రములందున ;

సరిగంచు బుటాల -

జిగినీ మెరుపులు చేరసాగినవి ; ||

పున్నమి చంద్రిక - ఝరీ తరంగిణి -

ఇరువురి నడుమను పోటీ ఇపుడు -

బహు, రంజు రంజుగా  సాగుతున్నది, చూడండీ ; ||

======================,

paurNima yaaminiki, 

neeli yamuna alala udhRtiki ;

ramjuga pOTI saagutunnadi, cUDamDI ; ||  

nIli mabbula wiSAla rekkalu - 

niDiwiga saacenu ; 

cakkani wennela bamgaru pakshi ; 

saagutunnadi diSala awadhulaku ; ||

parugulu teestuu - paDati raadhika ;

jilugu paawaDA, waluwala paina -

tana amdamu marimta inumaDimcagA ;

murisipOwucU saagutunnadi  ;

Sarat camdrika -

muripaalu pOwucU saagutunnadi  ; ||

yamuna alalalO - taLuku raagiNulu ; 

krishNa priyasaKi - wastramulamduna ;

sarigamcu buTAla -

jiginee merupula cErasaaginawi ; ||

punnami camdrika - jharI taramgiNi -

iruwuri naDumanu pOTI ipuDu -

bahu, ramju ramjugA sAgutunnadi, cUDamDI ; ||

&  శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; రంజుగ పోటీ - 115 ;

18, ఫిబ్రవరి 2023, శనివారం

గరుడగమనం, కుదుపులు -114

పక్షిరాజు మూపున తాపీగా కూర్చుని, 

వేణవూదుచుండెను క్రిష్ణమూరితి ; 

గండభేరుండమా! 

కుదుపులేమి లేకుండ - హడావుడి పడకుండ ;

నెమ్మదిగా సాగవోయి,

నీ గమనము వేగపడితె -

నీ మూపున కూర్చుని ఉన్నాడు -

వేణుగానలోలుడు ;

నువ్వు గాని తొట్రు పడితే -

మురళి కాస్త ఉలికిపడును -

రసగానము కలతపడును ;

లోకములను - ఆనందవాహినిలో - 

ఓలలాడించే సంగీతధార -, 

గండిపడితె ఊరుకోము -

అందుకనే, విహగపతీ, గరుడా!

నింపాదిగా సాగుమోయి ;

గరుడవాహనస్వామి -

కరుణారస రాగరాగిణుల -

మూర్ఛనల, శృతి లయల -

ఎల్లరి హృదయోల్లాసము ; ||  

=========================,

pakshiraaju mUpuna taapeegaa kuurcuni, 

wENawUducumDenu krishNamUriti ; 

gamDaBErumDamA! 

kudupulEmi lEkumDa - haDAwuDi paDakumDa ;

nemmadigaa saagawOyi,

nee gamanamu wEgapaDite -

nee muupuna kuurcuni unnADu -

wENugaanalOluDu ;

nuwwu gaani toTru paDitE -

muraLi kaasta  ulikipaDunu -

rasagaanamu kalatapaDunu ;

lOkamulanu - AnamdawaahinilO - 

OlalADimcE samgeetadhaara -, 

gamDipaDite UrukOmu -

amdukanE, wihagapatI, garuDA!

nimpaadigaa saagumOyi ;

garuDawaahanaswaami -

karuNArasa raagaraagiNula -

muurCanala, SRti layala -

ellari hRdayOllaasamu ; || 

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; గరుడగమనం, కుదుపులు -114 ;;

మది సంగీతమందిరము -113

నీ పదపద్మముల మంజీర ధ్వని ;

మా హృదయాలను -

సంగీత మందిరముగ - సేయగా ; 

ఘల్లుఘల్లు - అడుగులతో - 

రావయ్యా క్రిష్ణయ్యా! ; || 

నీ, పదనఖముల కాంతులు ; 

తిమిరమునకు బహు హడలు ;

మిత్తి మెత్తినట్టి - 

పాద పద్మముల అచ్చులను ;

కవి కన్నుల అద్దుకొనగ -

రావయ్యా క్రిష్ణయ్యా ; || 

చతుర ప్రభలు, ప్రకాశముల ; 

లోకములకు ఒసగుచుండ -

అడుగులోన అడుగేస్తూ -

రావయ్యా క్రిష్ణయ్యా ; ||

======================= ,

nee padapadmamula mamjeera dhwani ;

maa, hRdayaalanu -

samgeeta mamdiramuga - sEyagaa ; 

ghallughallu - aDugulatO - 

raawayyaa krishNayyaa! ;

nee, padanakhamula kaamtulu ; 

timiramunaku bahu haDalu ;

mitti mettinaTTi - 

paada padmamula acculanu ;

kawi kannula addukonaga -

raawayyaa krishNayyaa ; || 

catura prabhalu, prakASamula ; 

lOkamulaku osagucumDa -

aDugulOna aDugEstU -

raawayyaa krishNayyaa ; ||

శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  god krishna songs -  మది సంగీతమందిరము -113 ;

గాలితెమ్మెర భాగ్య ఘనత -112

 బృందావన వీచికా ; 

గోవర్ధన లహరికా ; 

మీదు  భాగ్యమే భాగ్యము ; ||  

క్రిష్ణమూర్తి వేణురవళి - 

మీదు వాహనమైనది, 

ఆహా, మీదు సౌభాగ్య గరిమను వర్ణించ -

కోటి జిహ్వలు, కావలయునులే, 

మలయ సమీరమా - 

శోభా శ్వాసికా, ఆశ్వాసికా! ; || 

మురళి గాన సమ్మోహన - 

లీలలను గ్రోలెడి ; 

రాధా వదన బింబ -

తన్మయ రసలాహిరి ; 

వీక్షించు భాగ్య గరిమను వర్ణించగా -

కోటి జిహ్వలు కావలయునులే, 

మలయ సమీరమా - 

గిరివాటికా శుభ లహరికా ;

నీదు భాగ్యమే భాగ్యము ;; ||

======================= 

 bRmdaawana weecikaa ; 

gOwardhana laharikaa ; 

meedu  BAgyamE BAgyamu ; ||  

krishNamuurti wENurawaLi - 

meedu waahanamainadi, 

AhA, mIdu sauBAgya garimanu warNimca -

kOTi jihwalu, kaawalayunulE, 

malaya sameeramaa - 

SOBaa SwaasikA, ASWAsikA! ; || 

muraLi gaana sammOhana - 

liilalanu grOleDi ; 

raadhaa wadana bimba -

tanmaya rasalaahiri ; 

wIkshimcu BAgya garimanu warNimcagA -

kOTi jihwalu kaawalayunulE, 

malaya sameeramaa - 

giriwATikA SuBa laharikA ;

nIdu BAgyamE BAgyamu ;; ||

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  god krishna songs -
prnt = గాలితెమ్మెర భాగ్య ఘనత- 112 ;- 

15, ఫిబ్రవరి 2023, బుధవారం

నెలపొడుపు దీపకాంతి - 111

 నెలపొడుపు కనుదోయిని - 

దివ్వెలుగా మలచెను ; 

కరుణాసాగరుడు - 

క్రిష్ణుడు వచ్చేదెపుడో!? ; ||

కడలి నీరు నల్లన - 

క్రిష్ణుడేమొ నల్లన ; 

చిలిపి క్రిష్ణు జాడలను ; 

కనుగొనేటి వీక్షణములు - రాధవి ;

తీక్ష్ణ నిరీక్షణా వీక్షణములు రాధవి ; ||

కలత పడే నెలతతోటి ; 

ఏలనయ్య? కృష్ణయ్యా! మేలమాడుట - 

తాను, కినుక నోము పట్టితేను, 

పస్తు ఉండవలిసేది ఎవరంట!? ఎవ్వరంట -

గమనంలో ఉంచుకోవయ్య, క్రిష్ణయ్యా! 

కాస్త - గుర్తు ఉంచుకోవయ్యా మా ముద్దుల స్వామీ! ; ||

===================== ,

nelapoDupu deepakaamti ;- 

nelapoDupu kanudOyini - 

diwwelugaa malacenu ; 

karuNAsaagaruDu - 

krishNuDu waccEdepuDO!? ; ||

kaDali neeru nallana - 

krishNuDEmo nallana ;  

cilipi krishNu jADalanu ; 

kanugonETi weekshaNamulu - raadhawi ;

tIkshNa nirIkshaNA wIkshaNamulu rAdhawi ; ||

kalata paDE nelatatOTi ; 

Elanayya? kRshNayyA! mElamADuTa - 

taanu, kinuka nOmu paTTitEnu, 

pastu umDawalisEdi ewaramTa!? ewwaramTa -

gamanamlO umcukOwayya, krishNayyaa! 

kAsta, gurtu umcukOwayya mA muddula swAmI! ; ||

&  శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  god krishna songs - నెలపొడుపు దీపకాంతి - 111 ;

నందనందన, ఆనందమైత్రి - 110

గోవర్ధన గిరిధారీ, మురళీ గానవిలోలా! 

లాసనాట్య ప్రజ్ఞాశాలీ! గోవిందా! ;

భక్తుల మనసుల - ప్రపుల్లపరచు -

పద్మనాభ, పద్మాలయనాధా! ; || 

నందనందనా - ఆనంద మిత్రమా! ||

యశోద జననీ వత్సల, 

సకల జనుల వాత్సల్య పెన్నిధీ,

నందకిశోరా, సకల జన మానస సరోవరమ్ముల ;

పరిమళించు సహస్ర దళ నీలి పద్మమా! || 

నందగోపాలా! బృందావన సంచార మయూరీ!

తొలి కిరణముల వేకువ నీవే - 

మాకు - తొలి కిరణముల వేకువ నీవే - 

నులి వెచ్చని -

సౌభాగ్య కిరణ శుభ కాంతివి నీవే స్వామీ! ; ||

భక్తుల మనసుల - ప్రపుల్లపరచు -

పద్మనాభ, పద్మాలయనాధా -

గోవర్ధన గిరిధారీ, మురళీ గానవిలోలా! 

లాసనాట్య ప్రజ్ఞాశాలీ! గోవిందా! ;  ||

================================ ,

namdanamdana, Anamdamaitri ;-

gOwardhana giridhArI, muraLI gAnawilOlA! 

laasanATya prajnaaSAlI! gOwimdA! ;

bhaktula manasula - prapullaparacu -

padmanABa, padmAlayanAdhA! ; || 

namdanamdanaa - aanamda mitramA! ||

yaSOda jananI watsala, 

akala janula waatsalya pennidhee,

namdakiSOrA, sakala jana mAnasa sarOwarammula ;

parimaLimcu sahasra daLa neeli padmamA! || 

namdagOpAlA! bRmdaawana samcaara mayuuree!

toli kiraNamula wEkuwa nIwE -

mAku - toli kiraNamula wEkuwa nIwE -

nuli weccani -

sauBAgya kiraNa SuBa kaamtiwi neewE swAmI! 

||bhaktula manasula - prapullaparacu -

padmanABa, padmAlayanAdhA -

gOwardhana giridhArI, muraLI gAnawilOlA! 

laasanATya prajnaaSAlI! gOwimdA! ||

 God krishna songs - 110 - kusuma  




 & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  god krishna songs - నందనందన, ఆనందమైత్రి - 110 ; 

14, ఫిబ్రవరి 2023, మంగళవారం

నిశీధి రేయి విశాలనేత్రి - 109

 విశాలనేత్రి నిశీధి రేయిని,

వేచిఉన్నది క్రిష్ణా! ; ||

నీలి జలమ్ముల యమునా వాహిని ;

నీలాల కన్నుల రాధిక, 

వేచి వేచి వేచి వేసారుతు ఉన్నది -

నీలమోహనాంగా - నీ కోసమె కృష్ణా! ; ||

బేల రాధిక, కన్నుదోయి - 

సంపూర్ణ బాష్ప సరోవరమాయెను ;

మేలమాడకుము, ఈ తీరుగ నీవు - 

నీలమోహనస్వామీ, 

సారెసారెకు - ఇటుల -

ముగ్ధ అభిసారిక రాధికా రమణిని ;

వేధించకుమోయీ, వేగిరమే ఇటు -

          రావోయి రావోయి ; ||

=======================  , 

wiSAlanEtri niSIdhi rEyini,

wEciunnadi krishNA! ; ||

neeli jalammula yamunA wAhini ;

neelaala kannula raadhika, 

wEci wEciwEci wEsArutu unnadi -

neelamOhanaamgaa - nee kOsame kRshNA! ; ||

bEla raadhika, kannudOyi - 

sampuurNa baashpa sarOwaramaayenu ;

mElamADakumu, ee tIruga nIwu - 

nIlamOhanaswAmI, sAresAreku - iTula -

mugdha abhisArika  raadhikaa ramaNini ;

wEdhimcakumOyI, wEgiramE iTu -

          rAwOyi rAwOyi ; ||

&  శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;   & 

నిశీధి రేయి విశాలనేత్రి - 109 ; god krishna songs - 109 ;

13, ఫిబ్రవరి 2023, సోమవారం

కవ్వం నాట్య నర్తనం - 108

కనుగొనగా, కన్నారా - కనువిందుల దృశ్యాలు ; 

వెన్నముద్ద గ్రోలగా, ఇదె వచ్చెను కన్నయ్య ;

శ్రీకృష్ణస్వామి శిశు రూపం అందరి నేత్రానందం ; || 

చిలుకుతోంది యశోదమ్మ, పాలు, పెరుగు నవనీతం

ముద్దు బాలక్రిష్ణునికి మోహనంపు ఇంపు చిరుతిండి ; 

వెన్నముద్ద గ్రోలగా, ఇదె వచ్చెను కన్నయ్య ; || 

1]  ధిమి ధిమి ధిమ్  తక తకిట - 

              ధిమ్ ధిమ్ ధిమ్ తకిట తకిట ;

దధి కుంభం లోన కవ్వమిదే ఆడుతున్నది - 

తధికిట తోమ్ -  తకిట  తకిట తద్ధిమి తోమ్ ;

మజ్జిగల తుంపురులు నేల పైన తొణికినవి ;

తొణికేటి తుంపురులతొ నేల నిండెను ;

చుక్కల ఆకాశమాయెనండీ ఈ భూమి ;

2] కుండలోన కవ్వమిదే ఆడుతున్నది - 

తధికిట తోమ్ తోమ్ - తళాంగు తోమ్ ; 

మీగడల పాలు, జతగ వేసేను జతి తాళం ;

తక్రం - జున్నుల కూటమి - 

           టప టప టప - టప టప టప  ; 

3] అంటినవి నీలి ఛాయ మేనునకు క్షీరబిందులు ;

దోగాడే కన్నయ్యకు ఒంటి నిండ తెల్ల పాల చుక్కలు

చుక్కల ఆకాశమాయెనండీ క్రిష్ణయ్య సొగసు రూపు ;

శ్రీకృష్ణస్వామి శిశు రూపం అందరి నేత్రానందం ; || 

 ;  =========================================  ; ,

kawwam nATya nartanam - 108 ;-

kanugonagaa, kannaaraa - kanuwimdula dRSyAlu ; 

wennamudda grOlagaa, ide waccenu kannayya ;

SreekRshNaswaami SiSu ruupam amdari nEtrAnamdam ; || 

yaSOdamma cilukutOmdi, pAlu perugu nawaneetam

muddu bAlakrishNuniki - mOhanampu impu cirutimDi 

wennamudda grOlagaa, ide waccenu kannayya ; || 

1] dhimi dhimi dhiమ్ taka takiTa - 

           dhimm dhimm dhimm taka takiTa ;

dadhi kumbham lOna kawwamidE ADutunnadi - 

tadhikiTa tOmm takiTa takiTa taddhimi tOmm ;

majjigala tumpurulu nEla paina toNikinawi ;

toNikETi tummurulato nEla nimDenu ;

cukkala aakaaSamaayenamDI I BUmi ;

2] kumDalOna kawwamidE ADutunnadi - 

tadhikiTa tOmm tOmm - taLAmgu tOmm ; 

meegaDala paalu, jataga wEsEnu jati tALam ;

takram - junnula kuuTami - 

Tapa TapaTapa - Tapa Tapa Tapa ; 

3] dOgADE kannayyaku omTi nimDa, 

                       tella paala cukkalu ;

amTinawi nIli CAya mEnunaku kshIrabimdulu ;

SrIkRshNaswAmi SiSurUpam amdari nEtrAnamdam ;||

; &   శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; song - 108 ;  god krishna songs - 108 ;- కవ్వం నాట్య నర్తనం ;- 108 ;-