బృందావన వీచికా ;
గోవర్ధన లహరికా ;
మీదు భాగ్యమే భాగ్యము ; ||
క్రిష్ణమూర్తి వేణురవళి -
మీదు వాహనమైనది,
ఆహా, మీదు సౌభాగ్య గరిమను వర్ణించ -
కోటి జిహ్వలు, కావలయునులే,
మలయ సమీరమా -
శోభా శ్వాసికా, ఆశ్వాసికా! ; ||
మురళి గాన సమ్మోహన -
లీలలను గ్రోలెడి ;
రాధా వదన బింబ -
తన్మయ రసలాహిరి ;
వీక్షించు భాగ్య గరిమను వర్ణించగా -
కోటి జిహ్వలు కావలయునులే,
మలయ సమీరమా -
గిరివాటికా శుభ లహరికా ;
నీదు భాగ్యమే భాగ్యము ;; ||
=======================
bRmdaawana weecikaa ;
gOwardhana laharikaa ;
meedu BAgyamE BAgyamu ; ||
krishNamuurti wENurawaLi -
meedu waahanamainadi,
AhA, mIdu sauBAgya garimanu warNimca -
kOTi jihwalu, kaawalayunulE,
malaya sameeramaa -
SOBaa SwaasikA, ASWAsikA! ; ||
muraLi gaana sammOhana -
liilalanu grOleDi ;
raadhaa wadana bimba -
tanmaya rasalaahiri ;
wIkshimcu BAgya garimanu warNimcagA -
kOTi jihwalu kaawalayunulE,
malaya sameeramaa -
giriwATikA SuBa laharikA ;
nIdu BAgyamE BAgyamu ;; ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి