నీ పదపద్మముల మంజీర ధ్వని ;
మా హృదయాలను -
సంగీత మందిరముగ - సేయగా ;
ఘల్లుఘల్లు - అడుగులతో -
రావయ్యా క్రిష్ణయ్యా! ; ||
నీ, పదనఖముల కాంతులు ;
తిమిరమునకు బహు హడలు ;
మిత్తి మెత్తినట్టి -
పాద పద్మముల అచ్చులను ;
కవి కన్నుల అద్దుకొనగ -
రావయ్యా క్రిష్ణయ్యా ; ||
చతుర ప్రభలు, ప్రకాశముల ;
లోకములకు ఒసగుచుండ -
అడుగులోన అడుగేస్తూ -
రావయ్యా క్రిష్ణయ్యా ; ||
======================= ,
nee padapadmamula mamjeera dhwani ;
maa, hRdayaalanu -
samgeeta mamdiramuga - sEyagaa ;
ghallughallu - aDugulatO -
raawayyaa krishNayyaa! ;
nee, padanakhamula kaamtulu ;
timiramunaku bahu haDalu ;
mitti mettinaTTi -
paada padmamula acculanu ;
kawi kannula addukonaga -
raawayyaa krishNayyaa ; ||
catura prabhalu, prakASamula ;
lOkamulaku osagucumDa -
aDugulOna aDugEstU -
raawayyaa krishNayyaa ; ||
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; god krishna songs - మది సంగీతమందిరము -113 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి