విశాలనేత్రి నిశీధి రేయిని,
వేచిఉన్నది క్రిష్ణా! ; ||
నీలి జలమ్ముల యమునా వాహిని ;
నీలాల కన్నుల రాధిక,
వేచి వేచి వేచి వేసారుతు ఉన్నది -
నీలమోహనాంగా - నీ కోసమె కృష్ణా! ; ||
బేల రాధిక, కన్నుదోయి -
సంపూర్ణ బాష్ప సరోవరమాయెను ;
మేలమాడకుము, ఈ తీరుగ నీవు -
నీలమోహనస్వామీ,
సారెసారెకు - ఇటుల -
ముగ్ధ అభిసారిక రాధికా రమణిని ;
వేధించకుమోయీ, వేగిరమే ఇటు -
రావోయి రావోయి ; ||
======================= ,
wiSAlanEtri niSIdhi rEyini,
wEciunnadi krishNA! ; ||
neeli jalammula yamunA wAhini ;
neelaala kannula raadhika,
wEci wEciwEci wEsArutu unnadi -
neelamOhanaamgaa - nee kOsame kRshNA! ; ||
bEla raadhika, kannudOyi -
sampuurNa baashpa sarOwaramaayenu ;
mElamADakumu, ee tIruga nIwu -
nIlamOhanaswAmI, sAresAreku - iTula -
mugdha abhisArika raadhikaa ramaNini ;
wEdhimcakumOyI, wEgiramE iTu -
rAwOyi rAwOyi ; ||
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; &
నిశీధి రేయి విశాలనేత్రి - 109 ; god krishna songs - 109 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి