గోవర్ధన గిరిధారీ, మురళీ గానవిలోలా!
లాసనాట్య ప్రజ్ఞాశాలీ! గోవిందా! ;
భక్తుల మనసుల - ప్రపుల్లపరచు -
పద్మనాభ, పద్మాలయనాధా! ; ||
నందనందనా - ఆనంద మిత్రమా! ||
యశోద జననీ వత్సల,
సకల జనుల వాత్సల్య పెన్నిధీ,
నందకిశోరా, సకల జన మానస సరోవరమ్ముల ;
పరిమళించు సహస్ర దళ నీలి పద్మమా! ||
నందగోపాలా! బృందావన సంచార మయూరీ!
తొలి కిరణముల వేకువ నీవే -
మాకు - తొలి కిరణముల వేకువ నీవే -
నులి వెచ్చని -
సౌభాగ్య కిరణ శుభ కాంతివి నీవే స్వామీ! ; ||
భక్తుల మనసుల - ప్రపుల్లపరచు -
పద్మనాభ, పద్మాలయనాధా -
గోవర్ధన గిరిధారీ, మురళీ గానవిలోలా!
లాసనాట్య ప్రజ్ఞాశాలీ! గోవిందా! ; ||
================================ ,
namdanamdana, Anamdamaitri ;-
gOwardhana giridhArI, muraLI gAnawilOlA!
laasanATya prajnaaSAlI! gOwimdA! ;
bhaktula manasula - prapullaparacu -
padmanABa, padmAlayanAdhA! ; ||
namdanamdanaa - aanamda mitramA! ||
yaSOda jananI watsala,
akala janula waatsalya pennidhee,
namdakiSOrA, sakala jana mAnasa sarOwarammula ;
parimaLimcu sahasra daLa neeli padmamA! ||
namdagOpAlA! bRmdaawana samcaara mayuuree!
toli kiraNamula wEkuwa nIwE -
mAku - toli kiraNamula wEkuwa nIwE -
nuli weccani -
sauBAgya kiraNa SuBa kaamtiwi neewE swAmI!
||bhaktula manasula - prapullaparacu -
padmanABa, padmAlayanAdhA -
gOwardhana giridhArI, muraLI gAnawilOlA!
laasanATya prajnaaSAlI! gOwimdA! ||
God krishna songs - 110 - kusuma
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; god krishna songs - నందనందన, ఆనందమైత్రి - 110 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి