అల్లరికి హద్దులేల - అంటాడు కృష్ణుడు ;
నీదు వేణు గాన మాధురిని ఈయవయ్య క్రిష్ణయ్యా!
పిల్లంగ్రోవి రాగము కట్నం, శుల్కం ;
మాకు "సంగీతం - ఓలి" ఇస్తే చాలును,
నీ అల్లరి నెటులో మేము భరియిస్తాము ; ||
మద్దిచెట్లు కూల్చినావు,
రక్కసులను అణచినావు ;
ఇంత ఘనుడవు నీవు,
ఏమి తెలియని వాని వలెనె ;
నటియిస్తూ ఉంటావు ; ||
'నోట వేలు చీకుతున్న -
చిన్ని ముద్దుబాలుని వలె -
నటియిస్తూ ఉంటావు ;
నటనాలు చాలునులే,
వెండి గిన్నెలోన బువ్వ తెచ్చినామయ్యా,
బొజ్జ నిండూ నీవు పెరుగుబవ్వలను తినరా
మురళి చేతపట్టరా,
*ఓలి ఈయరా! రాగమాలికల ఓలినీయరా!
[ఓలి = కన్యాశుల్కం] & + ;-
notes ;- [Oli = *ఓలి = marriage portion, money paid by a bridegroom to the parents of a bride ; కన్యాశుల్కం ; & + = Dowry ;- ఓలి, ఉంకువ, హరణము, యౌతౌకము ;
======================== ,
Oli dhanam - nee gaanam -
[God krishna song ;- 125 ] ;-
allariki haddulEla - amTADu kRshNuDu ;
needu wENu gaana maadhurini eeyawayya krishNayyA!
pillamgrOwi raagamu kaTnam, Sulkam ;
maaku "samgeetam - Oli" istE caalunu,
nee allari neTulO mEmu BariyistAmu ; ||
maddiceTlu kuulcinaawu,
rakkasulanu aNacinAwu ;
imta ghanuDawu neewu,
Emi teliyani waani walene ;
naTiyistU umTAwu ; ||
'nOTa wElu ceekutunna -
cinni muddubaaluni wale -
naTiyistU umTAwu ;
naTanaalu caalunulE,
wemDi ginnelOna buwwa teccinaamayyA,
bojja nimDua neewu perugubawwalanu tinarA
muraLi cEtapaTTarA,
*Oli eeyarA! raagamaalikala OlineeyarA!
[Oli = kanyASulkam] ;
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 - song-125 ;- ఓలి ధనం - నీ గానం ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి