7, ఫిబ్రవరి 2023, మంగళవారం

అభిసారిక రాధిక - 103

శుక శారికలకు అవకాశం, భళీ అవకాశం ;

దొరికెను ఇపుడే, భలేభలే అవకాశం ; 

అభిసారిక రాధిక - వేచి వేచి, వేసారిపోవడం ; ||

చిలిపి కృష్ణుని కోసం రాధిక -

వేచి వేచి వేసారిపోవుచుండగా -

మైనా, గోరువంకలు, పిట్టలు -

ఎగతాళి చేయుచూ మేలమాడుతూ, నవ్వుతున్నవి ;

సారె సారెకూ - రాధిక ఎదురుచూపులు -

మోహన వేణు గానలోలుని కోసము ; ||

నీలమోహనుడు ఉండలేడులే - 

`ముగ్ధ రాధిక భావన` లేక ;

పల్లవి లేని చరణము వోలె -

కృష్ణుడు ఏడను తాను ఉండలేడులే,

తెలుసుకోండి విహంగములారా!

చాలు చాలు మీ హంగామాలు ;

చాలించండి, గీరల హంగులు ;

రాధాఋష్ణుల పదమంజీరముల -

మంజుల ధ్వనులలొ -

మృదు గీతములై, లీనము కండి ;

సంగీత గాధల - లీలాకృష్ణుని -

వినుతి గాధల లీనమవండి ; ||

======================== ,

aBisArika rAdhika ;- song - 103 ;-

Suka SArikalaku awakASam, BaLI awakASam ;

dorikenu ipuDE, BalEBalE awakASam ; 

aBisArika rAdhika - 

wEci wEci, wEsAripOwaDam ;

cilipi kRshNuni kOsam - 

wEci wEci wEsAripOwucumDagaa -

mainaa, gOruwamkalu, piTTalu -

egatALi cEyucU mElamADutuu, nawwutunnawi ;

sAre saarekuu - raadhika edurucuupulu -

mOhana wENu gaanalOluni kOsamu ; ||

neelamOhanuDu umDalEDulE - 

'mugdha raadhika - BAwana' lEka ;

pallawi lEni caraNamu wOle -

kRshNuDu EDanu taanu umDalEDulE,

telusukOMDi wihamgamulArA!

caalu caalu mee hamgaamaalu ;

caalimcamDi, geerala hamgulu ;

raadhARshNula padamamjIramula -

mamjula dhwanulalo -

mRdu geetamulai, leenamu kamDi ;

samgeeta gaadhala - leelAkRshNuni -

winuti gaadhala leenamawamDi ; || ;

Song krishna radha 103 

అభిసారిక రాధిక ;- 103 ;- శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; ఫిబ్రవరి 2023 ; 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి