జోలమ్మ, జోలా - జోల జోలా!
ఉఌళ్ళ ఉఌళ్ళ ఉఌళ్ళ హాయీ,
లొల్లాయి లొల్లాయి లల్లరీ హాయి ; ||
తరుణులెల్లరు కలిసి,
జోల పాటల గమక రాగమ్ములందు -
ఉయ్యాలకింపైన తూగు కలిగేను ;
ఊయెలకు ఇంపైన ఊగు కలిగేను ; ||
చిరుగాలి గంధములు - గ్రంధములు అయ్యేను ;
కావ్య, ఇతిహాస - గ్రంధములు అయ్యేను ; ||
మా బాలక్రిష్ణయ్య,
ఉంగ ఉంగాలు, చొంగల్లు, నురుగులు -
ఉయ్యాల తొట్టెలో - సుధలు నిండేను ;
పసిడి ఉయ్యాల తొట్టెలో - సుధలు నిండేను ; ||
పట్టు పరుపులపైన పారిజాతాలు ;
మెత్తని బంగారు ఉత్తరీయాలు ;
పరిచి ఉంచిన డోల కనువిందు చేసేను ;
చిన్నిక్రిష్ణమ్మకు, ఏల కునుకు వచ్చుట లేదు!? ; ||
తరుణ తామరరేకు దళములను తెచ్చాము ;
ఒత్తుగా నింపాము - తామరసనయనుడా,
జోల పాటల - జగతి - తూగుతున్నాది ;
వటపత్రశాయీ, సిరి పద్మనయనుడా!
చిలిపి అల్లరి మాని, ఒత్తిగిలవయ్యా ;
మా జోల పాటలకు -
లయ తాళ గమకములను కూర్చి -
మాధురీ - సుక్షేత్రసీమలుగ మార్చేయుమోయీ! ; ||
=============================== ,
teepi jOlapATalu - 107 ;-
jOlamma, jOlaa - jOla jOlaa!
uఌLLa uఌLLa uఌLLa haayee,
lollaayi lollaayi lallaree haayi ; ||
taruNulellaru kalisi,
jOla pATala gamaka raagammulamdu -
uyyaalakimpaina tuugu kaligEnu ;
Uyelaku impaina uugu kaligEnu ; ||
cirugaali gamdhamulu - gramdhamulu ayyEnu ;
kaawya, itihaasa - gramdhamulu ayyEnu ; ||
maa baalakrishNayya,
umga umgaalu, comgallu, nurugulu -
uyyaala toTTelO - sudhalu nimDEnu ;
pasiDi uyyaala toTTelO - sudhalu nimDEnu ; ||
paTTu parupulapaina paarijaataalu ;
mettani bamgaaru uttareeyaalu ;
parici umcina DOla kanuwimdu cEsEnu ;
cinnikrishNammaku, Ela -
kunuku waccuTa lEdu!? ; ||
taruNa taamararEku daLamulanu teccaamu ;
ottugaa nimpaamu - taamarasanayanuDA,
jOla pATala - jagati - tuugutunnaadi ;
waTapatraSAyI, siri padmanayanuDA!
cilipi allari maani, ottigilawayyaa ;
maa jOla pATalaku -
laya tALa gamakamulanu kuurci -
maadhurI -
sukshEtraseemaluga maarcEyumOyI! ; ||
ఌ ౡ ఌ ౡ ఌ ౡ - ఌ ౡ - ఌ ౡ - ఌ ౡ =
& ; శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; song - 107 ;-
తీపి జోలపాటలు - 107 ;
thank u very much ;
రిప్లయితొలగించండి