వంపు సొంపు మావి కొమ్మ -
చిగురు కోరె కోయిలమ్మ ;
మధురమైన కృష్ణ వేణు గానమేల -
శ్రవణములకు సోకలేదు -
అనుచు రాధ చిన్నబోవుచున్నదిరా -
రావోయీ కన్నయ్యా ;
మాచిన్నారి బాలక్రిష్ణ ; ||
యమున మోవి అలలను స్పృశియించెను మేఘము
శ్రావణఋతు లహరికలకు కలల మేళాలు,
కా-వలసినన్ని కలబోతలు దొరికినవి ;
నీలమోహన క్రిష్ణ, జాగు మాని, రావయ్యా ; ||
నీదు రాకయే రాధకు బహు సాంత్వన కదా,
మరి, నీకు తెలియనిదా, ఈ సంగతి,
సరి కొత్తది వలె - ముఖకవళిక పెడ్తావు నీవు,
భలే భలే, భళిరా - అల్లరి మానేసి త్వరగ,
ముద్దరాలి ముంగిట, నీ రాసకేళీ రాసలీల -
వైభవాల రంగవల్లి వేయవయ్య,
వ్రేపల్లియ గారాబు నందనుడా,
గుంభనాల గోవిందుడా ; ||
==================== ,
God Krishna songs ;-
gumBanAla gOwimduDu ;- 124 ;-
waMpu sompu maawi komma -
ciguru kOre kOyilamma ;
madhuramaina kRshNa wENu gaanamEla -
SrawaNamulaku sOkalEdu -
anucu raadha cinnabOwucunnadiraa -
raawOyee kannayyaa ;
maacinnaari baalakrishNa ; ||
yamuna mOwi alalanu spRSiyimcenu mEGamu ;
SrAwaNaRtu laharikalaku kalala mELAlu,
kaa-walasinanni kalabOtalu dorikinawi ;
neelamOhana krishNa, jaagu maani, raawayyaa ; ||
needu raakayE raadhaku bahu saamtwana kadaa,
mari, neeku teliyanidaa, I samgati,
sari kottadi wale - muKakawaLika peDtaawu neewu,
BalE bhalE, BaLirA - allari mAnEsi twaraga,
muddaraali mumgiTa, nee raasakELI raasaleela -
waibhawaala ramgawalli wEyawayya,
wrEpalliya gaaraabu namdanuDA,
gumBanAla gOwimduDA ; ||
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- గుంభనాల గోవిందుడు-124 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి