ఆ చివరన నక్కిఉండె గోవిందుడు ;
దుడుకు గోపాలుడు ; దుందుడుకు గోపాలుడు ;
ఆచితూచి అడుగు వేసి పట్టండమ్మా! ; ||
కస్తూరీతిలకుడు, బర్హిపింఛధారి -
తన చిట్టి నాసికకు ముత్యాల నత్తులలో -
వెన్నెలమ్మ - మిసిమి కాంతి శోభ చెరగుతోంది ; ||
క్రిష్ణమూర్తి శ్రవణమ్ముల రత్నాల కుండలముల -
వెన్నెలమ్మ - మిసిమి శోభ చెరిగి పోయుచున్నది ;
సరిగెచీర చెరగులలో ఒడిసి పట్టండమ్మా,
గోవర్ధనగిరిధారిని పట్టండమ్మా : ||
చక్కనైన *కొండగుర్తులిన్ని దొరకెను ;
ధేనువుల దొరగారిని ఇట్టె పట్టేద్దాము ; ||
ఇట్టె ఇట్టె, చిటికెలోన దొరుకుతాడు అనుకుంటిమి ;
ఎంతకినీ పట్టలేకున్నాము ముద్దులపట్టిని ;
యశోదమ్మ ముద్దుపట్టిని, ఇది ఏమి చోద్యమో!? ; ||
&
[ *కొండగుర్తులు - ఆనవాలు - జాడ = traces ] ;
========================================= ,
A ciwarana nakkiumDe gOwimduDu ;
duDuku gOpAluDu ; dumduDuku gOpAluDu ;
AcitUci aDugu wEsi paTTamDammA! ; ||
kastuureetilakuDu, barhipimCadhAri -
tana ciTTi naasikaku mutyaala nattulalO -
wennelamma - misimi kAmtiSOBa ceragutOmdi ; ||
krishNamUrti SrawaNammula -
ratnAla kumDalamula -
wennelamma - misimi SOBa cerigi pOyucunnadi ;
sarigeceera ceragulalO oDisi paTTamDammA,
gOwardhanagiridhArini paTTamDammA : ||
cakkanaina komDagurtulinni dorakenu ;
dhEnuwula doragaarini iTTe paTTEddAmu ; ||
iTTe iTTe, ciTikelOna dorukutADu anukumTimi ;
emtakinee paTTalEkunnAmu muddula paTTini ;
yaSOdamma muddupaTTini, idi Emi cOdyamO ; ||
; & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; కొండగుర్తులు, ఆనవాళ్ళు -121 ;- పాట - part 1 ;-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి