11, ఫిబ్రవరి 2023, శనివారం

కాస్త ఆగవమ్మ రాధికా 106

తళ తళ తళ - తళ తళ తళల -

చుక్కలన్ని నీ వెంట వస్తున్నవి ; 

ఆగవమ్మ  రాధికా, కాస్త ఆగవమ్మ రాధికా ; ||

ఝణ ఝణ ఝణ - ఝణ ఝన ;

ఝణన ఝణన వడ్డాణం మువ్వల ధ్వని ; 

నీ నవ్వులను అనుసరించు, చకోరాక్షి, జవరాలా!

కిణ కిణ కిణ - కిణ కిణ కిణ ;

కంకణాల మధుర ధ్వని - 

నీ చూపు తూపులందు తూగేను ; ||

గల గల గల - ఘల్ ఘల్ ఘల్ ; 

నీదు, పద మంజీరముల చేరు ;;

కిల కిల కిల - చలనములు ; 

నీదు పలుకులందు చేరుటకు తహతహలు ; || 

ఆగవమ్మ రాధికా, కాస్త ఆగవమ్మ రాధికా ;

క్రిష్ణ గాధల వస్త్రములకు - 

మెరుపు చాందినీ రిమఝిమలు -

నీవే కద, అందులకే - కాస్త ఆగవమ్మ రాధికా ; ||

===========================  ,

 kAsta Agawamma rAdhikA - 106 ;-

taLa taLa taLa - taLa taLa taLala -

cukkalanni nI wemTa wastunnawi ; 

Agawamma  rAdhikA,

 kAsta Agawamma rAdhikA ; ||

JaNa JaNa JaNa - JaNa Jana ;

JaNana JaNana waDDANam muwwala dhwani ; 

nee nawwulanu anusarimcu, 

cakOrAkshi, jawarAlA!

kiNa kiNa kiNa - kiNa kiNa kiNa ;

kamkaNAla madhura dhwani - 

nee cuupu tuupulamdu tUgEnu ; ||

gala gala gala - ghal ghal ghal ; 

nIdu, pada mamjeeramula cEru ;;

kila kila kila - calanamulu ; 

nIdu palukulamdu cEruTaku tahatahalu ; || 

Agawamma rAdhikA, kAsta Agawamma rAdhikA ;

krishNa gaadhala wastramulaku - 

merupu caamdinI rimajhimalu -

nIwE kada, amdulakE - kAsta Agawamma rAdhikA ; || 

 ;

 శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; song - 106 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి