సదా నీ ధ్యానమేరా, గోవిందా!
సాదా ఊహలు చిప్పిలు మనసు రాధది,
ఎరుకయే కదా, నీ మనసునకు ; ||
"ఒట్టు, తప్పక వస్తానంటావు ' ;
ఊటగ తేనెల మాటల నాలుక నీదిలె ;
తెలియని ప్రియమణి రాధిక మాత్రం -
అట్టే నిలిచి చూచుచున్నది,
నీకై ఎదురు చూస్తూ ఉన్నది తాను ; ||
గట్టులు, పుట్టల వెంట తిరుగుతూ,
ముద్దరాలిని మరిచిపోకుమా!
వైలమె రారా, చిలిపి కృష్ణుడా ||
===================================== ,
tEnela mATala UTalu - 118 ;-
sadaa nI dhyAnamErA, gOwimdA!
saadaa uuhalu cippilu manasu rAdhadi,
erukayE kadaa, nee manasunaku ; ||
"oTTu, tappaka wastaanamTAwu ' ;
UTaga tEnela mATala naaluka needile ;
teliyani priyamaNi raadhika maatram -
aTTE nilici cUcucunnadi,
nIkai eduru cUstuu unnadi taanu ; ||
gaTTulu, puTTala wemTa tirugutuu,
muddaraalini maricipOkumA!
wailame raarA, cilipi kRshNuDA ||
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- తేనెల మాటల ఊటలు-118 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి