అనుకున్నానా!!?
ఎపుడైనా, ఇటుల అనుకున్నానా,
గడసరి కృష్ణుడు ఇటుల -
మురిపించి - మైమరపించి ;
మరుపున మురళిని ఉంచునని ;
ఈ "రాధామురళి"ని ఉంచునని ; ||
తోటకు పరిమళ భాషను నేర్పెను ;
తరువు, లతలకు - విరివిగ ఇచ్చెను ;
మకరంద లేపన, సుమ భూషణములు ; ||
మధు పరాగము లెన్నో ఇచ్చీ,
సుధా సంద్రముల పయనించుమనె ;
నగవులు చిందే స్వామి లీలలను -
ప్రీతిని అర్చన చేయు రాధకు -
విస్తృతమ్ముగా తెలియవని .... ,
తెలియని స్వామి - తాను కాడులే -
రాధకు - యావత్తు -
గాధలు, ఇతివృత్తమ్ములు -
బోధించును - తానే -
గీత కృష్ణుడు - సంగీత క్రిష్ణుడు ; ||
============================== ;
rAdhAmuraLi, kRshNuni kELi ;- song - 104 ;-
anukunnaanaa!!?
epuDainaa, iTula anukunnaanaa,
gaDasari kRshNuDu iTula -
muripimci - maimarapimci ;
marupuna muraLini umcunani ;
ee "raadhaamuraLi"ni umcunani ; ||
tOTaku parimaLa BAshanu nErpenu ;
taruwu, latalaku - wiriwiga iccenu ;
makaramda lEpana, suma BUshaNamulu ; ||
madhu paraagamu lennO iccii,
sudhaa samdramula payanimcumane ;
nagawulu cimdE swAmi leelalanu -
priitini arcana cEyu raadhaku -
wistRtammugaa teliyawani .... ,
teliyani swaami - taanu kADulE -
rAdhaku - yAwattu -
gaadhalu, itiwRttammulu -
bOdhimcunu - taanE -
geeta kRshNuDu - samgeeta krishNuDu ;
& - శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; 104 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి