కనుగొనగా, కన్నారా - కనువిందుల దృశ్యాలు ;
వెన్నముద్ద గ్రోలగా, ఇదె వచ్చెను కన్నయ్య ;
శ్రీకృష్ణస్వామి శిశు రూపం అందరి నేత్రానందం ; ||
చిలుకుతోంది యశోదమ్మ, పాలు, పెరుగు నవనీతం
ముద్దు బాలక్రిష్ణునికి మోహనంపు ఇంపు చిరుతిండి ;
వెన్నముద్ద గ్రోలగా, ఇదె వచ్చెను కన్నయ్య ; ||
1] ధిమి ధిమి ధిమ్ తక తకిట -
ధిమ్ ధిమ్ ధిమ్ తకిట తకిట ;
దధి కుంభం లోన కవ్వమిదే ఆడుతున్నది -
తధికిట తోమ్ - తకిట తకిట తద్ధిమి తోమ్ ;
మజ్జిగల తుంపురులు నేల పైన తొణికినవి ;
తొణికేటి తుంపురులతొ నేల నిండెను ;
చుక్కల ఆకాశమాయెనండీ ఈ భూమి ;
2] కుండలోన కవ్వమిదే ఆడుతున్నది -
తధికిట తోమ్ తోమ్ - తళాంగు తోమ్ ;
మీగడల పాలు, జతగ వేసేను జతి తాళం ;
తక్రం - జున్నుల కూటమి -
టప టప టప - టప టప టప ;
3] అంటినవి నీలి ఛాయ మేనునకు క్షీరబిందులు ;
దోగాడే కన్నయ్యకు ఒంటి నిండ తెల్ల పాల చుక్కలు
చుక్కల ఆకాశమాయెనండీ క్రిష్ణయ్య సొగసు రూపు ;
శ్రీకృష్ణస్వామి శిశు రూపం అందరి నేత్రానందం ; ||
; ========================================= ; ,
kawwam nATya nartanam - 108 ;-
kanugonagaa, kannaaraa - kanuwimdula dRSyAlu ;
wennamudda grOlagaa, ide waccenu kannayya ;
SreekRshNaswaami SiSu ruupam amdari nEtrAnamdam ; ||
yaSOdamma cilukutOmdi, pAlu perugu nawaneetam
muddu bAlakrishNuniki - mOhanampu impu cirutimDi
wennamudda grOlagaa, ide waccenu kannayya ; ||
1] dhimi dhimi dhiమ్ taka takiTa -
dhimm dhimm dhimm taka takiTa ;
dadhi kumbham lOna kawwamidE ADutunnadi -
tadhikiTa tOmm takiTa takiTa taddhimi tOmm ;
majjigala tumpurulu nEla paina toNikinawi ;
toNikETi tummurulato nEla nimDenu ;
cukkala aakaaSamaayenamDI I BUmi ;
2] kumDalOna kawwamidE ADutunnadi -
tadhikiTa tOmm tOmm - taLAmgu tOmm ;
meegaDala paalu, jataga wEsEnu jati tALam ;
takram - junnula kuuTami -
Tapa TapaTapa - Tapa Tapa Tapa ;
3] dOgADE kannayyaku omTi nimDa,
tella paala cukkalu ;
amTinawi nIli CAya mEnunaku kshIrabimdulu ;
SrIkRshNaswAmi SiSurUpam amdari nEtrAnamdam ;||
; & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; song - 108 ; god krishna songs - 108 ;- కవ్వం నాట్య నర్తనం ;- 108 ;-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి