స్వరమేళన సామ్రాజ్యాలు -
ఇవే ఇవే ఇవే ;
ఉల్లములు ఉప్పొంగగ,
ఉల్లాసము సృష్టి నిండ ; ||
రాధ ప్రేమ -
మధుర భావముల ముల్లె ;
సరిగమలు శతకోటి -
జగతి వేణువాయెను ; ||
సంగీతము శృతి నిధి ;
గీతములు లయ "గని" ;
కన్నె మనసు కనుగొనిన -
వేణువునకు మేలుకొలుపు ; ||
క్రిష్ణయ్యా, తెలుసుకొనుము,
అంబుజాక్షి కనుకొలుకుల -
జాలువారు వలపులు -
నీ మురళికెపుడు -
తొలి పల్లవి, చరణాలు ; ||
====================== ,
muraLiki pallawi dorikinadi ;- song ;-
swaramELana saamrAjyaalu -
iwE iwE iwE ;
ullamulu uppomgaga,
ullaasamu sRshTi nimDa ; ||
raadha prEma -
madhura BAwamula mulle ;
sarigamalu SatakOTi -
jagati wENuwaayenu ; ||
samgeetamu SRti nidhi ;
gItamulu laya "gani" ;
kanne manasu kanugonina -
wENuwunaku mElukolupu ; ||
krishNayyaa, telusukonumu,
ambujaakshi kanukolukula -
jaaluwaaru walapulu -
nee muraLikepuDu -
toli pallawi, caraNAlu ; ||
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- God Krishna songs -127 ;
పాట ;- మురళికి పల్లవి దొరికినది ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి