28, మార్చి 2023, మంగళవారం

నవ్య దేవగాంధర్వం-153

అలౌకికానందముల నొసగే

సంగీత జగతీ సృజనకర్తవు -

నీవేనయా, మా ముద్దుకృష్ణా!!

విమలగాంధర్వ వనితలు వచ్చిరి ;

వేణుమాధవా! జాలము సేయకు

వేగమె మన ఉపవనములకేతెంచి, 

వచ్చి, మురళిని పట్టరా! చేబూనరా! ; || 

కొత్త పుంతలను తొక్కుతున్నది ;

దేవగాంధర్వం, దేవకీసుతుని కతమున -

స్వర్గమమున సంగీత కళలకు

కొత్త రూపులు కలుగుచున్నవి ఇప్పుడు ; || 

సరళతర గాంధర్వమందున  

నూత్న వైవిధ్యతలు ఎన్నో -

స్వర్లోకవాసులకందరికినీ

భవ్య హర్షం, ధవళతేజం ; || ` 

====================== , 

naTanaawatamsaa, gaanalOlA,

alaukikaanamdamula nosagE

samgeeta jagatee sRjanakartawu -

neewEnayA, maa muddukRshNA!!

wimalagaamdharwa wanitalu wacciri ;

wENumaadhawaa! jaalamu sEyaku

wEgame mana upawanamulakEtemci, 

wacci, muraLini paTTarA! cEbUnarA! ; || 

kotta pumtalanu tokkutunnadi ;

dEwagaamdharwam, dEwakeesutuni katamuna -

swargamamuna samgeeta kaLalaku ` 

kotta ruupulu kalugucunnawi ippuDu ; || ` `  

saraLatara gaamdharwamamduna  

nuutna waiwidhyatalu ennO -

swarlOkawaasulakamdarikinee

bhawya harsham, dhawaLatEjam ; ||

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  

God krishna song- 153 ; నవ్య దేవగాంధర్వం ;

27, మార్చి 2023, సోమవారం

గాలికొంగుల బంగారము-152

యమున అలలపైన 

తేలి తేలి విహారాల సమీరం 

ఇంత కులుకు ఎందులకో!!? ; ||

కొండగాలి కెరటాల

పంక్తులెన్నొ వరుసలుగా,

క్రిష్ణ మురళి గానమ్మును- 

       కౌగిలించుకొనుటకై ; ||

నూలుపోగులల్లె -

                వాయులీన వయ్యారం 

వేణురవళి వంపుసొంపులందున -

ప్రతి పంక్తికి తాదాత్మ్యం ; ||

చిరుగాలి కలనేతల -

"గాలి కొత్త వస్త్రాలు" ;

వలువల కొసముడులందున -   

సంగీతం, మధుగానం - 

ఆహాహా! కొంగుల బంగారము ; || 

======================== ,

komgula bamgaaramu-152 ;-  

yamuna alalapaina 

tEli tEli wihaaraala sameeram 

imta kuluku emdulakO!!? ; ||

komDagaali keraTAlu/ la

pamktulenno warusalugaa,

krishNa muraLi ganammunu -

                kaugilimcukonuTakai ; ||

nuulupOgulalle - 

                waayuleena wayyaaram 

wENurawaLi wampusompulamduna -

prati pamktiki taadaatmyam ; ||

cirugaali kalanEtala -

"gaali kotta wastraalu" ;

waluwala kosamuDulamduna -   

samgeetam, madhugaanam - 

aahaahaa! komgula bamgaaramu ; || 

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  

God krishna song-152 ;

గాలికొంగుల బంగారము - 152 ;

చిత్రం-చిత్తరువు-151

బలరాముడు కుంచె పట్టి

తమ్ముడి బొమ్మలను వేశాడు ; ||

శిఖిపింఛం మిలమిలలు - 

నవనీతం మిసమిసలు ;

క్రిష్ణ అధరమ్ముల మిసమిసలు ; ||

కస్తూరీ తిలకమ్ము తళుక్కులు

ఉరమున, తల్లి తీర్చిదిద్దినట్టి -

గోవింద నామముల కాంతి ;

బొమ్మ పుణికిపుచ్చుకునునా, 

ఇంత అందము!!? ; ||

బలరాముడు కుంచె పట్టి

తమ్ముడి బొమ్మలను వేశాడు ;

బొమ్మ పుణికిపుచ్చుకునునా, 

ఇంత అందము!!? ; ||

గోపికలారా! వేగిరమే రండమ్మా!

మన బాలగోపాలునికి -

దిష్టిని తీయండి, 

సత్వరమే కనుదిష్టిని తీయండి ;

======================== ,

citram-cittaruwu-151 ;- `song `

balaraamuDu kumce paTTi

tammuDi bommalanu wESADu ; ||

SiKipimCam milamilalu - 

nawanItam misamisalu ;

krishNa adharammula misamisalu ; ||

kastuurii tilakammu taLukkulu

uramuna, talli teercididdinaTTi -

gOwimda naamamula kaamti ;

bomma puNikipuccukununaa, 

imta amdamu!!? ; ||

balaraamuDu kumce paTTi

tammuDi bommalanu wESADu ;

bomma puNikipuccukununaa, 

imta amdamu!!? ; ||

gOpikalaarA! wEgiramE ramDammA!

mana baalagOpaaluniki -

dishTini tIyamDi, 

satwaramE kanudishTini tIyamDi ; 

************************************ ,

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; 

God krishna song- 151 ;



అకుంఠితదీక్షా వ్రతము-150

భక్తసందోహముల నోము ఒక్కటే!

వైకుంఠవాసుని దర్శనాభిలాష,

శ్రీవైకుంఠవాసుని దర్శన అభిలాషయే ; ||

వినమ్రతతొ భక్తులు - నోము ఒకటి పట్టిరి,

అవిశ్రాంత దీక్షా కంకణములు కట్టిరి ; ||

వినమ్రతతొ భక్తులు - నోము ఒకటి పట్టిరి,

అదియే, అకుంఠితదీక్షా వ్రతము ;

గోవింద క్రిష్ణ నామ సంకీర్తన వ్రతము ; ||

================================  ,

akumThitadeekshaa wratamu ;- `song ;- `

bhaktasamdOhamula nOmu okkaTE!

waikumThawaasuni darSanaabhilaasha,

SrIwaikumThawaasuni darSana abhilaashayE ; ||

winamratato bhaktulu - nOmu okaTi paTTiri,

awiSraamta deekshaa kamkaNamulu kaTTiri ; ||

winamratato bhaktulu - nOmu okaTi paTTiri,

adiyE, akumThitadeekshaa wratamu ;

gOwimda krishNa naama samkeertana wratamu ; ||

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  

God krishna song- 150 ;అకుంఠితదీక్షా వ్రతము-150

God krishna song- 150 


26, మార్చి 2023, ఆదివారం

కృష్ణ ఛాయలో జీవనగమనము-149

 ఊరువాడకు ఎరుక కదా, 

               కావ్యనాయిక గమనము

పూజారిణి రాధిక, 

             మనో దైవము మురళీధరుడే! ||

నీలమోహనుని నీడలోన రాధ గమనము

నీలి ఛాయలోన పడతి - చిందువన్నె ఆరబోతలు ;

వీక్షణాల ఊయెలలో హాయి హాయి హాయిలే ; ||

తన- హృదయ కుటీరాన - క్రిష్ణ ప్రతిమ నెలకొన్నది ;

నీలమోహనుని నీడలోన రాధ జీవనం ;

వేణుగాన రసపాయి, హాయి హాయి హాయిలే ; ||

===================================== ;

uuruwADaku eruka kadaa, 

         kaawyanaayika gamanamu

puujaariNi raadhika - 

     manOdaiwamu muraLIdharuDE! ||

neelamOhanuni nIDalOna - raadha gamanamu

neeli CAyalOna paDati wannecimdula aarabOtalu ;

weekshaNAla uuyelalO haayi hAyi hAyilE ; ||

tana hRdaya kuTIraana - 

           krishNa pratima nelakonnadi

neelamOhanuni nIDalOna - raadha jeewanam ;

wENugaana rasapaayi, haayi hAyi hAyilE ; || 

శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  

God krishna song- 149

& వేణుగాన రసపాయి / -

కృష్ణ ఛాయలో జీవనగమనము-149 ;

24, మార్చి 2023, శుక్రవారం

చిరుగాలి కొంగుముడి బంగారం-148

రజత కాసు, స్వర్ణ నాణెం - 

విలువయిన ధననిధులు ; 

చిరుగాలి కొంగుముడుల నిండా -

            ఉప్పతిల్లు అమూల్య నిధులే!

అమోఘ నవరత్న గని నిధులే! ; ||

వేణురవళి, సిగలోని పింఛాల తళుకు -

కన్నయ్య పలువరుసల మెరుపులు ;

మెడలోని ముత్యాలదండ రోచిస్సులు ;

ఉరము పయిన - పూదండల పరిమళాలు ;

ఇన్నిటినీ వెదజల్లిన తుషార చలువలు ;

ఇన్నింటి కలనేతల గాలి వలువలు ; || 

యమున అలల చల్లగాలి, గోవర్ధన కొండగాలి -

వరిపైరుల మేలమాడు వ్రేపల్లియ చిలిపి గాలి - 

శతకోటి వింత కాంతి, -

            సురభిళాల మన్నికైన పోగులు ;

వన్నె నూలుపోగులతొ, 

తనను తానె మలుచుకుంది - కొత్త వస్త్రమ్ముగా,

గాలి కొత్త దుస్తులు - కాసు-ముడికి ఆలంబనం ; 

సంగీతం, మధుగానం - కొంగుల బంగారము,

గాలి కొంగుల బంగారమే! ; || 

========================== ,

cirugaali komgumuDi bamgaaram  - song ;148 ;- 

rajata kaasu, swarNa nANem - 

wiluwayina dhananidhulu ; 

cirugaali komgu muDula nimDA -

             uppatillu amUlya nidhulE!

amOGa nawaratna gani nidhulE! ; ||

wENurawaLi, sigalOni pimCAla taLuku -

kannayya paluwarusala merupulu ;

meDalOni mutyaaladamDa rOcissulu ;

uramu payina - puudamDala parimaLAlu ;

inniTinI wedajallina tushaara caluwalu ;

innimTi kalanEtala gaali waluwalu ; || 

yamuna alala callagaali, gOwardhana komDagaali -

waripairula mElamADu wrEpalliya cilipi gaali - 

SatakOTi wimta kaamti,  -

            surabhiLAla mannikaina pOgulu ;

wanne nuulupOgulato, tananu taane - -

            malucukumdi kotta wastrammugaa,

gaali kotta dustulu, kaasu-muDiki aalambanam ; 

samgeetam, madhugaanam - komgula bamgaaramu,

gaali komgula bamgaaramE! ; ||  

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  God krishna song-148 ; 

చిరుగాలి కొంగుముడి బంగారం - 148  ;; 

22, మార్చి 2023, బుధవారం

గురుపీఠ రాణి - 147

క్రిష్ణ ప్రేయసికి - 

గురుపీఠమ్ము లభియించె ;  

శ్రీకృష్ణ ప్రేయసి రాధికకు -

అరుదైన గురుపీఠ భాగ్యమ్ము లభియించె ; 

వహ్వారె, చూడండి, లలనలారా, 

రమణీయ ప్రణయదేవతా తూలికా

    చిత్రిత మణి వర్ణ శోభలారా!  ; ||

రాగాల లహరి - సంగీతలాహిరి ;

రాధమ్మ ఒడిని - కన్నయ్య చేరి ;

ప్రకృతిలోని ప్రతి అణువు 

              బృందావని ఆయె ;

మృదుల బృందావని ఆయె ; || 

అధరమల మురళిని కొనగోట మీటి ;  

మధు శృతులు దశదిశల ప్రవహించి ; 

రసిక హృదయాలు విరిసి, 

              ఎల్లెడల పులకింతల రాశి ; || 

ఎవ్వారిదమ్మా ఇపుడు ఈ శిష్యరికము? 

మును తనకు తెలియని విద్యలను నేర్వగా ; 

వచ్చి చేరినది చిలుకవాహనుని రాణి ; 

రాధమ్మ మ్రోల - సత్వరమె - ఇచట -

"పతి ప్రేమ పొందేటి చిట్కాలు తెలుపమని"

              బ్రతిమాలుచున్నది -

పుష్పశరముల విలుకాని అర్ధాంగి,

వహ్వారె, వలపు పాఠములు నేర్ప,

గురుస్థానమును అధిరోహించె ;

వయ్యారి నెరజాణ, శ్రీకృష్ణ ష హృదయ సామ్రాజ్ఞి ;

======================================= ,

gurupITha rANi ;- song - 147 ;- 

krishNa prEyasiki - 

gurupIThammu laBiyimce ;  

SrIkRshNa prEyasi raadhikaku -  

arudaina gurupITha bhaagyammu laBiyimce ; 

wahwaare, cUDamDi, lalanalaarA, 

ramaNIya praNayadEwataa tuulikaa

    citrita maNi warNa SOBalArA!  ; ||

raagaala lahari - samgItalaahiri ; 

raadhamma oDini - kannayya cEri ;

prakRtilOni prati aNuwu ; 

   bRmdaawani aaye ;

mRdula bRmdaawani aaye ; || 

adharamala muraLini konagOTa mITi ;  

madhu SRtulu daSadiSala prawahimci ; 

rasika hRdayAlu wirisi,

              elleDala pulakimtala rASi ; || 

ewwaaridammA ipuDu I Sishyarikamu? 

munu tanaku teliyani widyalanu nErwagA ; 

wacci cErinadi cilukawaahanuni rANi ; 

raadhamma mrOla - satwarame - icaTa -

"pati prEma pomdETi ciTkaalu telupamani" 

bratimAlucunnadi -

pushpaSaramula wilukaani ardhaamgi,

wahwaare, walapu pAThamulu nErpa,

gurusthAnamunu adhirOhimce ;

wayyAri nerajANa, 

              SrIkRshNa hRdaya sAmraajni ;

శోభకృత్  రాధాకృష్ణ గీతాలు 2023 ;  

                                God krishna song-147  

& wish u all Happy SOBakRt nAma - 

                     ugaadi SuBAkAmkshalu 2023 ;

& అందరికీ శోభకృత్ నామ - 

             ఉగాది శుభాకాంక్షలు 2023 ;- 

శోభకృత్ నామ - ఉగాది శుభాకాంక్షలు 2023 

20, మార్చి 2023, సోమవారం

సబబు కాదు-146

కోటి కలువల కలల ఆశల దొన్నెలందున - 

నీదు ఊహల చలువ వెన్నెలను -

నింపుకొని ఉన్నాను ఇచట, యమునా తటిని క్రిష్ణా! ||

చెంపకు చారెడు కన్నుల - చెలియలు రాధను నేను ;

కలువకన్నుల కన్నీరు నింపుట తగని అలవాటు ;

వ్యధల తిక్త కఠిన కషాయాల కాన్కలిచ్చుట  - 

పాడి కాదురా, తెలుసు కదరా,  

       నీకు మున్నే,  తెలుసు కదరా, నా స్వామీ! ||

వెన్న పాలు, ఉగ్గుగిన్నెల నీకు ఇత్తురు తరుణులు ;   

కఠిన తిక్త కషాయమ్మును ఇచ్చుచున్నావు, చాలును,

"ఎడబాటుల చేదు పానీయాలు" ఇటుల ఇచ్చుట - 

పాడి కాదురా, తెలుసు కదరా,  

       నీకు మున్నే,  తెలుసు కదరా, నా స్వామీ! ||

&

song = సబబు* కాదు ;

సబబు* = ఔచిత్య - సమంజసం ;

============================== ,

sababu* kaadu - song-146 ;-

kOTi kaluwala kalala ASala donnelamduna - 

needu uuhala caluwa wennelanu -

nimpukoni unnaanu icaTa, 

       yamunaa taTini krishNA! ||

cempaku caareDu kannula - 

         celiyalu raadhanu nEnu ;

kaluwakannula kannIru nimpuTa  

       tagani alawATu ;

wyadhala tikta kaThina  

       kashAyAla kaan kaliccuTa  - 

pADi kAdurA, telusu kadaraa, 

nIku munnE,  telusu kadaraa, nA swAmI! ||

wenna pAlu, ugguginnela nIku itturu taruNulu ;   

kaThina tikta kashAyammunu -

          iccucunnAwu, cAlunu

             eDabATula-cEdu pAnIyAlu iTula iccuTa - 

pADi kAduraa, telusu kadaraa, 

       nIku munnE,  telusu kadaraa, nA swAmI!

God krishna song-146  ;sababu* kaadu - song-146 ;-

& + sababu* = aucitya - samamjasam ]; ;

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  

God krishna song-146 ;

వేణుగానము స్వర్ణనావ-145

నీ నయనాల నీడలలోన ;

జీవనయానం సాగవలెనురా, 

 - నా జీవనయానం, 

సాగవలెనురా, నా స్వామీ ; ||

నీ దరి నుంటే అంతే చాలును, 

ముందరి అడుగు నీదోయి,

నీ అడుగులొ అడుగును వేస్తూ ..... 

ఆవలి తీరము చేరుదునోయీ ;

భద్రముగా -

ఆవలి తీరము చేరుదునోయీ  ; ||

మురళీగానము స్వర్ణనావలో - 

బ్రతుకు సాగర ప్రవాహము -

ఆవలి దరిని చేరగలుగుదును ; 

సుభద్రముగా -

ఆవలి తీరము చేరుదునోయీ ||

============================ ,

wENugAnamu swarNanaawa ;-

nee nayanaala nIDalalOna ;

jeewanayaanam saagawalenuraa, 

 - naa jeewanayaanam, 

saagawalenuraa, naa swaamee ; ||

nee dari numTE amtE cAlunu, 

mumdari aDugu needOyi,

nI aDugulo aDugunu wEstU ..... 

Awali teeramu cErudunOyI ;

bhadramugaa -

aawali teeramu cErudunOyI  ; ||

muraLIgAnamu swarNanaawalO - 

bratuku saagara prawaahamu -

aawali darini cEragalugudunu ; 

subhadramugaa -

aawali teeramu cErudunOyI ||;

శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; 

God krishna song-145 ;- వేణుగానము స్వర్ణనావ-145 ;

19, మార్చి 2023, ఆదివారం

అటు ఇటు సంగమం-144

ఈ దరినీ, ఆ దరినీ తడిపే జలమొక్కటే ;

అందరిలో జాగృతిని కలిగించేదొక్కడే,

      అతడే శ్రీకృష్ణుడు ; ||

వానకారు మేఘాలు పలకరించెను ;

జగతి ఎల్ల ఆనందం వెల్లివిరిసెను ;

గోవర్ధనగిరి పయిన -

          పువులు విరియగా ;

నందివర్ధనాలు, గోవర్ధన -

               పువులు విరియగా ;

బోనాలను తీర్చిదిద్ది

      కదులుదాము అందరమూ ; ||

నందివర్ధనం, పొగడలు, గోవర్ధన, పొన్నలు ;

కొమ్మలన్ని స్వాగతముల తోరణాలు ఆయెనుగా ; ||

కన్నయ్య నెయ్యమున-

       ప్రకృతితోడ మైత్రి పొసగెను -

మనుజులకు - ప్రకృతి మైత్రి పొసగేను ; || 

======================================= , 

aTu iTu samgamam ;- song-144 ;- 

I darinee, aa darinee taDipE jalamokkaTE ;

amdarilO jAgRtini kaligimcEdokkaDE,

      ataDE SrIkRshNuDu ; ||

waanakaaru mEGAlu palakarimcenu ;

jagati ella aanamdam welliwirisenu ;

gOwardhanagiri payina -

          puwulu wiriyagaa ;

namdiwardhanaalu, gOwardhana -

               puwulu wiriyagA ;

bOnAlanu tIrcididdi

      kaduludaamu amdaramU ; ||

namdiwardhanam, pogaDalu, gOwardhana, ponnalu ;

kommalanni swAgatamula tOraNAlu AyenugA ; ||

kannayya neyyamuna-

       prakRtitODa maitri posagenu -

manujulaku - prakRti maitri posagEnu ; ||

&

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;

God krishna song-144 ; అటు ఇటు సంగమం-144 ;

ఆమె నవ్వు నవరత్నం జల్లు ;- -143

నీలిమొయిలు చేతి నిండ, చాలా పని ఉన్నది ; 

కన్నెపిల్ల నగల మెరుపు, వింత మన్నికైనది ;

పాపిటబిళ్ళ పొడుల -

           మెరుపు షోకు సరిచేసెను ;

                'మొయిలు మెరుపు' సరిచేసెను ; ||

కన్నియ మెడలోన -

             కొంటె కంటె, కిసుక్కున నవ్వినది ;

కొంటె కంటె*, హార ఉంగరములు -

"మా మెరుపులు మిన్న." అనుచు -

             మేళమాడుచున్నవి ; 

వడ్డాణం, పట్టీలు, కంకణాలు, గాజులు -

పొత్తులుగా, రవల సొగసులిచ్చినవి మబ్బుకు ; ||

రాధ నవ్వు, ఒకటి చాలు, నవరత్నం పోగు సమం ;

తులసీదళధారి క్రిష్ణ చిలిపి వీక్షణాల కోణంగి -

నిఖిల సృష్టికెప్పుడూ - నవ్య వరముల జల్లులు ; ||

& కంటె* =  a type of necklace ;  

===================================== ,

aame nawwu nawaratnam jallu ;-  143 ;- song ;- 

nIlimoyilu cEti nimDa, caalaa pani unnadi ; 

kannepilla nagala merupu,  -

            wimta mannikainadi ;

pApiTabiLLa poDula -

           merupu shOku saricEsenu ;

               `moyilu merupu` saricEsenu ; ||

kanniya meDalOna -

             komTe kamTe, kisukkuna nawwinadi ;

komTe kamTe*, haara umgaramulu -

"mA merupulu minna." anucu -

             mELamADucunnawi ; 

waDDANam, paTTIlu, kamkaNAlu, gaajulu -

pottulugaa - rawala sogasuliccinawi mabbuku ; ||

rAdha nawwu, okaTi caalu,  -

             nawaratnam pOgu samam ;

tulasIdaLadhaari krishNa  -

             cilipi weekshaNAla kONamgi -

niKila sRshTikeppuDU -

             nawya waramula jallulu ; ||

& kamTe* =  `a type of necklace` ;  

&

God krishna song-143 ;- 

ఆమె నవ్వు నవరత్నం జల్లు ;- -143 ;

శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023- 143  ;

17, మార్చి 2023, శుక్రవారం

భావలాలిత్యాలు -142

లలిత భావ లాలిత్య సలలిత -

             తప్త మధు బిందుల - 

చిన్ని తుంపురుల గిలిగింతల - 

అలివేణీ నీలికురుల జిలిబిలి కదలికల - 

ఉప్ ఉఫ్ ఉఫ్ఫున కుప్పిగంతుల ; 

పరిమళములు అలిమినవి -

          ముంగురుల అలకలు, 

                సిరి జాణ అలుకలు ;  

                   జీరాడుచు కులుకులు ; || 

పడతి అడుగుజాడల ; 

               పదంబడి, పదములాని, 

వేడుకొనేటి వాడుక మనకు -  

             వేడుకలే, బహు వేడుకలే ; ||

సోయగాల ప్రార్ధనలను మన్నించే -

రాధాక్రిష్ణుల ప్రణయగానముల - 

వెన్నెల తరియిస్తూ ఉంటే - 

చూచు కనులకు పండుగ ; 

నిత్య వీక్షణముల మానసమ్ములకు - 

 పండుగయే, ప్రతి క్షణమూ పండుగయే ; ||  

============================ , 

lalita bhaawa laalitya  

             salalita tapta madhu bimdula - 

cinni tumpurula giligimtala - 

aliwENI nIlikurula jilibili kadalikala - 

up uph uphphuna kuppigamtula ; 

parimaLamulu aliminawi -

mumgurula alakalu,  

             siri jANa alukalu ; 

jIrADucu kulukulu -  

             paDati aDugujADala ; 

padambaDi, padamulaani, 

wEDukonETi wADuka manaku - 

         wEDukalEbahu wEDukalE ; ||

sOyagaala praardhanalanu mannimcE -

raadhAkrishNula praNayagaanamula - 

wennela tariyistU umTE - 

cUcu kanulaku pamDuga ; 

nitya weekshaNamula maanasammulaku - 

prati kshaNamU pamDugayE ; || 

భావలాలిత్యాలు - God krishna song-142 ;

శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023- 142  ;

మసక వెన్నెలకు ప్రకాశము-141

మేలిమి తళుకుల నవ్వులవాడు -

                వచ్చేనమ్మా, వచ్చేను ;

మేలిముసుగులో,

       ఇందువదన శోభలకేలా మసకలు -

ఈ మసకమసక వెన్నెలమ్మకు - 

    పూర్ణ శోభలను ఇవ్వవమ్మ, రాధికా!

       సంపూర్ణ శోభలను ఇవ్వవమ్మ, రాధికా! ||

పౌర్ణమి ఇంకా కోరును -     

           అదనపు వెలుగులు, భళీ భళీ! 

నవనీతచోరుడా! ఇక నీ చేతిలోనె ఉన్నది,

శీత పౌర్ణిమకు ఇవ్వగలిగిన ఆ వరము ; ||

తమసులకేలనె భీతిల్లెదవు?

గాఢ తమస్సులకేలనె భీతిల్లెదవు, 

   చంద్రపౌర్ణమీ!

కళారాజ్య తపస్సులిక్కడ, 

అవిరళమ్ముగా సాగుతున్నవి; 

క్రిష్ణరాధల ప్రణయ తపస్సులు ;

నిరాళి కేళిని తేలు వేళలలో - 

తమస్సులంటే భయము ఏలనే!?

ఓ నిండుపౌర్ణమీ మేలుమేలులే,

చాలు చాలులే, భళి భళి భళిలే! ; ||

=========================  ,

masaka wennelaku prakASamu ;- 

mElimi taLukula nawwulawADu 

            waccEnammA, waccEnu ;

mElimusugulO -

            imduwadana SOBalakElA masakalu -

ee masakamasaka wennelammaku - 

    pUrNa SOBalanu iwwawamma, rAdhikA!

      sampUrNa SOBalanu iwwawamma, rAdhikA! ||

paurNami imkA kOrunu -     

           adanapu welugulu, BaLii BaLI! 

nawaneetacOruDA! ika nee cEtilOne unnadi,

       SItapaurNimaku - iwwagaligina A waramu ; ||

tamasulakElane BItilledawu?

gADha tamassulakElane BItilledawu, 

   camdrapaurNamI!

kaLAraajya tapassulikkaDa, 

awiraLammugaa saagutunnawi; 

krishNarAdhala praNaya tapassulu ;

nirALi kELini tElu wELalalO - 

tamassulamTE Bayamu ElanE!?

O nimDupaurNamI mElumElulE,

cAlu cAlulE, BaLi BaLi BaLilE! ; ||

&

 మసక వెన్నెలకు ప్రకాశము-141 &

 God krishna song-141 & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;

15, మార్చి 2023, బుధవారం

నటనావతంసుడు-140

నటనావతంసుడు కృష్ణుడు వచ్చెను ;

శ్రీకృష్ణస్వామి పదముద్రికల, 

దారులు పద్మము కొలనులు ఆయెను ; || 

నల్లనయ్య అడుగుజాడలు సోకినంతనే,

ధరాతలమ్ము, సకలప్రకృతి -

అణువణువూ పరిమళభరితమాయెను ; ||

వాతావరణము కుశలమాయెను ; 

విశ్వము, ఆనందపత్రిక ఆయెను ;

వసుధ సాంతము, 

   మధు ఋతువులకు, 

     ఆహ్వానపత్రికయె ఆయెను ; ||

సంజీవని మూలిక - 

    ధాతు స్పర్శయే,

       రాధిక పొలుపు ;

తమ్ములమేసిన అధరసుగంధము ;

     హర్షాతిరేకముల అమృతవర్షిణి ;

రాధా అధర సుగంధము అమృతవర్షిణి ;  ||

ఇలాతలమ్ము - ఇంద్రసరస్సులు ; 

నీటి కలువలకు తికమక కలుగుట -

మైమరుపుల అలజడులెపుడూ, 

జగత్తులోన, కడు వినోదమ్మే  ; ||

========================= ,

naTanAwatamsuDu-140 ;-

naTanAwatamsuDu kRshNuDu waccenu ;

SrIkRshNaswaami padamudrikala, 

daarulu padmamu kolanulu Ayenu ; || 

nallanayya aDugujADalu sOkinamtanE,

dharaatalammu, sakalaprakRti -

aNuwaNuwuu parimaLabharitamAyenu ; ||

wAtAwaraNamu kuSalamAyenu ; 

wiSwamu, aanamdapatrika Ayenu ;

wasudha saamtamu, 

   madhu Rtuwulaku, 

     AhwAnapatrikaye Ayenu ; ||

samjIwani muulika - 

    dhaatu sparSayE,

       raadhika polupu ;

tammulamEsina adharasugamdhamu ;

     harshaatirEkamula amRtawarshiNi ;

rAdhA adhara sugamdhamu amRtawarshiNi ;  ||

ilaatalammu - imdrasarassulu ; 

niiTi kaluwalaku tikamaka kaluguTa -

maimarupula alajaDulepuDU, 

jagattulOna, kaDu winOdammE  ; ||

God krishna song-140 & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;

 krishna radha - song -140 



మసక వెన్నెలకు శోభలు -139

మేలిముసుగులో ఇందువదన

               శోభలకేలా మసకలు -

మసకమసక వెన్నెలకు, 

              శోభలను ఇవ్వవమ్మ, రాధికా! || 

మేలిమి తళుకుల నవ్వులవాడు 

               వచ్చేనమ్మా, వచ్చేను ;

ఇక, 

వెన్నెలకు శోభలను ఇవ్వవమ్మ, రాధికా! 

సంపూర్ణ శోభలను ఇవ్వవమ్మ, రాధికా! ||

పౌర్ణమి ఇంకా కోరును - 

అదనపు వెలుగులను, భళి భళీ! 

నవనీతచోరుడా!

              ఇక నీ చేతిలోనె ఉన్నది,

పౌర్ణిమకు - ఇవ్వగలిగిన వరము ;

తమస్సులకేలనె భీతిల్లెదవు, పౌర్ణమీ! 

అవిరళముగ సాగుతున్నవి

               కళారాజ్య తపస్సులు ; 

క్రిష్ణరాధ ప్రణయారాధన తపస్సులు ;

నిరాళి కేళి తేలేటి వేళలలో

               - తమస్సులంటే భయమేలా!?

ఓ నిండుపౌర్ణమీ, మేలుమేలులే,

చాలు చాలులే, భళి భళి భళిలే!;  ||

============================= ,` 

masaka wennelaku SOBalu - song - 139 ;- 

mElimusugulO imduwadana

               SOBalakElaa masakalu -

masakamasaka wennelaku, 

              SOBalanu iwwawamma, raadhikA! || 

mElimi taLukula nawwulawADu

               waccEnammA, waccEnu ;

ika, 

wennelaku SOBalanu

               iwwawamma, rAdhikA! 

sam pUrNa SOBalanu iwwawamma, rAdhikA! ||

paurNami imkaa kOrunu

               - adanapu welugulanu, BaLi BaLI! 

nawaneetacOruDA! 

ika nee cEtilOne unnadi,

paurNimaku - iwwagaligina waramu ;

tamassulakElane BItilledawu, paurNamI! 

awiraLamuga saagutunnawi

               kaLAraajya tapassulu ; 

krishNarAdha praNayaaraadhana tapassulu ;

nirALi kELi tElETi wELalalO -

               tamassulamTE BayamElA!?

O nimDupaurNamI, mElumElulE,

cAlu cAlulE, BaLi BaLi BaLilE!;  ||

;

పాట 139 ;- మసక వెన్నెలకు శోభలు - 

God krishna song-139 & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;

14, మార్చి 2023, మంగళవారం

కెరటాల సుమదళాలు-138

కెరటాల పూల రేకులు - 

సిద్ధం సిద్ధం ;

ఝణన ఝణన ఝణ నాట్యాల,

క్రిష్ణ చరణారవిందములను -

పూజ సేయు తృష్ణతో-

కాళిందీ కెరటాల-పూ రేకులు -

     సిద్ధం సిద్ధం ; ||

"మౌనభాష ఇక ఎందులకు!?"

నెమ్మదిగా ఉన్నట్టి -

నదివాహిని "తరంగిణులు" -

తారంగం తారంగం -

నటనాటల క్రిష్ణయ్య పదగుంఫన - 

లయగతుల పాదద్వయి -

ముదమారా చేరసాగె ; ||

చేరువనే వ్రేపల్లె - 

ప్రజలందరు గుమిగూడి,

చేరేరు నదిఒడ్డుకు ;

కాళీయుని పడగలిపుడు -

ఒడుపుగా - 

క్రిష్ణ చరణ నాట్యాలకు -

      రంగవేదిక ఐన -

వింత నేడు చూడంగా ; ||

=================== ,

PART - 1 ;-  keraTAla sumadaLAlu-138 ;-

keraTAla puula rEkulu - 

siddham siddham ;

JaNana JaNana JaNa nATyaala,

krishNa caraNaarawimdamulanu -

puuja sEyu tRshNatO-

kALimdii keraTAla-pUla rEkulu -

     siddham siddham ; ||

"maunaBAsha ika emdulaku!?"

nemmadigaa unnaTTi -

nadiwaahini "taramgiNulu" -

taaramgam taaramgam -

naTanATala krishNayya padagumphana - 

layagatula paadadwayi -

mudamaaraa cErasaage ; ||

cEruwanE wrEpalle - 

prajalamdaru gumigUDi,

cErEru nadioDDuku ;

kALIyuni paDagalipuDu -

oDupugaa - 

krishNa caraNa nATyaalaku -

      ramgawEdika aina -

wimta nEDu cUDamgA ; ||

**************************** ;

పాట   part - 1;- కెరటాల సుమదళాలు-138 ;- 

God krishna song-138 & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; 

3, మార్చి 2023, శుక్రవారం

తెలిసింది, బృందావన గమ్మత్తు- -137

రేయి పర్ణశాలలో ఉన్నాది పౌర్ణమి ;

విరహిణి పౌర్ణమికి తోడున్నవి - 

తన వేసారే ఊహలు, వేయి కోట్ల ఊహలు ; ||

మబ్బు పడకపైన వాలిఉంది పున్నమి ;

వడలిన కువలయము వోలె శీతచంద్రిక* ; 

"మెరుపు తూలికలు" వేయును 

             చిత్రమైన తన బొమ్మలు ; ||

పసందైన కేకి ఆట - పున్నమికి వరాలు ;  

పింఛాలు పొదువుకొనెను కోటి మెరుపు వరహాలు ; 

క్రిష్ణ పిల్లంగ్రోవి రాగాలు వచ్చిచేరాయి ;

దశ దిశలా వసంతాల మేళవింపులే ; ||

చిత్ర బాధలు సైతం ప్రకాశించు ఇచ్చట ;

వియోగాలు, విలాపాలు - శోభలగుటయే -

చెప్పలేని వింత కదా - నందనవనమందున ;

ఇది, నందనవన సామ్రాజ్యం, తెలిసివచ్చెను ; || 

&

శీతచంద్రిక* = చల్లని వెన్నెల ; 

=============================== ,

telisimdi, bRmdaawana gammattu-137 ;- 

rEyi parNaSAlalO unnaadi paurNami -

wirahiNi paurNamiki tODunnawi -

tana wEsaarE Uhalu, wEyi kOTla Uhalu ; ||

mabbu paDakapaina waaliumdi punnami ;

waDalina kuwalayamu wOle SItacamdrika* ; 

merupu-tUlikalu wEyunu 

             citramaina tana bommalu ; || 

pasamdaina kEki ATa, punnamiki waraalu ; 

pimCAlu poduwukonenu kOTi merupu warahaalu ; 

krishNa pillamgrOwi rAgAlu waccicErAyi ;

daSa diSalA wasamtaala mELawimpulE ; ||

citra baadhalu saitam prakASimcu iccaTa ;

wiyOgaalu, wilaapaalu - SOBalaguTayE -

ceppalEni wimta kadA - namdanawanamamduna ;

idi, namdanawana saamraajyam, telisiwaccenu ; || 

& SItacamdrika* = callani wennela ;

& తెలిసింది, బృందావన గమ్మత్తు-137 ; 

God krishna song-137 & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; 

2, మార్చి 2023, గురువారం

గిరి అర్చనలు-136

అన్నీ న్నీ కావు, కోలాహలములు,

జనుల కోలాహలములు ; ||

ముంగొంగులు నడుమున దోపిరి ;

మగువలు ముంగొంగులు నడుమున దోపిరి ;

ఆడా మగా పిల్లా పీచూ,

అందరు ముందుకు నడిచారు ; ||

కేకలు వేయుచు - ఒకరిని ఒకరు పిలుచుచుండిరి ;

బిగ్గరగా పిలుచుచుండిరి ;

కూటమి అయ్యీ, కూడలి నుండి బయలుదేరిరి ;

పల్లియ చెట్టు-రచ్చబండ కడ -

దినుసుల కుండలు దింపారు -

వలసిన సరుకుల లెక్కచూచుకుని ;

బయలుదేరెను జనసందోహం ; ||

గోవర్ధనగిరి అర్చన - అంటే మాటలు కాదు ;

ముహూర్తవేళ మించకూడదు -

హెచ్చరికలతో కోలాహలములు మిన్నులంటగా -

చేరిరి కొండను ఆబాలగోపాలము ;

మేలిమి నవ్వుల తిలకధారుడు క్రిష్ణుడు ;

ఎప్పుడు చేరెనో మరి - 

ముందే అక్కడ అవతరించెను ;

శ్రీకృష్ణ దర్శనము - పారవశ్యత ; 

పులకిత పరిమళ మానసమ్ముల -

మనుజులెల్లరూ గిరిపూజలను చేసారు,

పూజలు వరములు - వర్షధారలు ...., 

జడివానలతొ నేలతల్లికి పారవశ్యత, 

సృష్టికి ఇచ్చే బహుమతులు ; ||

============================ ,

giri arcanalu ;- song-136 ;-  

annii innI kAwu, kOlaahalamulu,

janula kOlaahalamulu ; ||

mumgomgulu naDumuna dOpiri ;

maguwalu mumgomgulu naDumuna dOpiri ;

ADA magaa pillaa peecuu,

amdaru mumduku naDicAru ; ||

kEkalu wEyucu - okarini okaru pilucucumDiri ;

biggaragaa pilucucumDiri ;

kUTami ayyii, kUDali numDi bayaludEriri ;

palliya ceTTu-raccabamDa kaDa -

dinusula kumDalu dimpaaru -

walasina sarukula lekkacuucukuni ;

bayaludErenu janasamdOham ; ||

gOwardhanagiri arcana - amTE mATalu kAdu ;

muhuurtawELa mimcakUDadu -

heccarikalatO kOlAhalamulu minnulamTagA -

cEriri komDanu aabaalagOpaalamu ;

mElimi nawwula tilakadhAruDu krishNuDu ;

eppuDu cErenO mari - 

mumdE akkaDa awatarimcenu ;

SrIkRshNa darSanamu - paarawaSyata ; 

pulakita parimaLa maanasammula -

manujulellaruu giripUjalanu cEsAru,

puujalu waramulu - warshadhaaralu ...., 

jaDiwaanalato nElatalliki paarawaSyata, 

sRshTiki iccE bahumatulu ; ||

&  గిరి అర్చనలు ;- song - 136 ; God krishna song-136 ; 

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- 

సమాధానం ఇదే!-135

ధరణి విస్మయము పొందేను ;

ఏమి మాయయో, కడలి నీలము కాంతి -

మాధుర్య మధువుగా జాలువారు  తీరును కనుగొని,

ధరణి విస్మయము పొందేను ; ||

ఏమి మాయయో, అంబర నీలము - 

తేనెవాకగా జాలువారేటి తీరును కనుగొని, 

నలు దిక్కులకూ కడు విస్మయము ; ||

అన్ని మాయలకు సమాధానము* లభియించినది ;

నీలమోహనుడు క్రిష్ణుని -

"మేని ఛాయ గడుసుదనమిది" ;

తేటతెల్లముగ తెలిసివచ్చినది ; ||

సమాధానం* = జవాబు, Answer ; 

======================= , 

samaadhaanam idE!-135 ;  

dharaNi wismayamu pomdEnu ;

Emi maayayO, kaDali neelamu kaamti -

mAdhurya madhuwugaa 

               jaaluwaaru  teerunu kanugoni,

dharaNi wismayamu pomdEnu ; ||

Emi maayayO, ambara nIlamu - 

tEnewaakagaa jaaluwaarETi teerunu kanugoni, 

nalu dikkulakU kaDu wismayamu ; ||

anni maayalaku samaadhaanamu* laBiyimcinadi ;

nIlamOhanuDu krishNuni -

"mEni CAya gaDusudanamidi" ;

tETatellamuga telisiwaccinadi ; ||

samaadhaanam* = jawaabu, `Answer `

God krishna song-135 = సమాధానం ఇదే!-135 ;

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; 

అందరూ నిపుణులే-134

మనుషులు, మనసారా - ఇచ్చట -

షోడశాలంకార నిపుణులుగా మారినారు 

స్వచ్ఛమైన నిపుణులుగా మారినారు ; || 

తల్లి యశోద, రేవతి, 

వ్రేపల్లియ ప్రజానీకము -

సేకరించ వచ్చినారు 

నెమలి ఈకలు సేకరించ వచ్చినారు ;

వడివడిగా జానపదులు -

చిట్టడవిని తిరుగాడిరి ; ||

"నేను ముందు చూసానని "

నేనంటే నేను - అనుచు - 

వాదులాట వినోదాలు ;

ఎల్లరూ, ఉరికి ఉరికి, 

పింఛములను ఏరుతూ ఉన్నారు ; ||

బాలక్రిష్ణ ముచ్చటల ముడిలోన -

'బర్హిపింఛముల మెరుపు" ;

"వల్లె వల్లె" అని వెన్నెల -

జత కలిసెను ;

పింఛముల మెరుపులతో -

తెలి వెన్నెల జత కలిసెను ; ||

======================= ; 

amdarU nipuNulE-134 ;- 

manushulu, manasaaraa - iccaTa -

shODaSAlamkaara nipuNulugaa maarinaaru 

swacCamaina nipuNulugaa maarinaaru ; || 

talli yaSOda, rEwati, 

wrEpalliya prajaaneekamu -

sEkarimca waccinaaru 

nemali eekalu sEkarimca waccinaaru ;

waDiwaDigaa jaanapadulu -

ciTTaDawini tirugADiri ; ||

"nEnu mumdu cuusaanani "

nEnamTE nEnu - anucu - 

waadulaaTa winOdaalu ;

ellaruu, uriki uriki, 

pimCamulanu Erutuu unnaaru ; ||

baalakrishNa muccaTala muDilOna -

barhipimCamula merupu ;

"walle walle" ani wennela -

jata kalisenu ;

pimCamula merupulatO -

teli wennela jata kalisenu ; ||

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- God krishna song-134 ;  

& అందరూ నిపుణులే-134 ;

జలబిందుల ముఖబింబాలు-133

మేఘబాలలొచ్చారు ; 

నీలిగగనతలమును - చదును చేసి, వెళ్ళారు ;

నున్నగా, చదును చేసి వెళ్ళారు 

మేఘాల కుర్రవాళ్ళు ; || 

కాళింది తరగల చల చల్లని తుంపురులు ;

కొండగాలి చిలకరించు నీటి తుంపురులను ; 

వనితా వదనముల పయిన, 

కొండగాలి చిలకరించు ; ||

వికసిత వనితల ముఖబింబములు ;

వేల పురులను విప్పి ఆడెడు నెమళుల వోలె -

వనితల ముఖబింబములు భ్రాంతి విలసిల్లేను ; ||

శిఖిపింఛధారి క్రిష్ణుడు -

పిల్లనగ్రోవి - అల్లన మ్రోగెను,

కోటి మయూరీ నృత్యహేలలు -

మనోపీఠముల అధివసించెను ; ||

====================== ;

jalabimdula mukhabimbaalu ;- 

mEGabAlaloccAru ; 

nIligaganatalamunu - cadunu cEsi, weLLAru ;

nunnagaa, cadunu cEsi weLLAru 

mEGAla kurrawALLu ; || 

kALimdi taragala cala callani tumpurulu ;

komDagAli cilakarimcu nITi tumpurulanu ; 

wanitaa wadanamula payina, 

komDagAli cilakarimcu ; ||

wikasita wanitala mukhabimbamulu ;

wEla purulanu wippi ADeDu nemaLula wOle -

wanitala muKabimbamulu BrAmti wilasillEnu ; ||

SiKipimCadhaari krishNuDu -

pillanagrOwi - allana mrOgenu,

kOTi mayUrI nRtyahElalu -

manOpIThamula adhiwasimcenu ; || 

& జలబిందుల ముఖబింబాలు-133 ;

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- `God krishna song-133 ;

పైటచెంగు మేఘం -132

పైటచెంగు విసిరేస్తే నీలిమేఘమయ్యింది ; 

అది కాస్తా, పన్నీటికి గొడుగే అయ్యింది ; 

పమిటకొంగు గారడీలు చాల చాల ఉన్నవి ;  

లేజవ్వని - 

      -  పమిటకొంగు గారడీలు చాల చాల ఉన్నవి ; 

గుప్పెడు మాటలు చాలవు, వివరించి చెప్పడానికి ;

ఆ గారడీల తమాషాలు - విస్తరించి చెప్పుటకు ; || 

ఆషామాషీ కాదు, రాధ కొంగు జాలము,

చిలిపి ఆటలాడకు, గడుసు క్రిష్ణుడా!

కొంగు పట్టి లాగితే, మబ్బు నోటితో -

ఆకాశం ఉరుముతుంది, క్రిష్ణయ్యా! జాగ్రత్త ; || 

============================= ,  

paiTacemgu mEGam - 132 - krishna song ;- 

paiTacemgu wisirEstE nIlimEGamayyimdi ; 

adi kaastaa, pannITiki goDugE ayyimdi ; 

pamiTakomgu gaaraDIlu caala caala unnawi ;  

lEjawwani - 

           pamiTakomgu gaaraDIlu caala cAla unnawi ; 

guppeDu mATalu cAlawu wiwarimci ceppaDAniki,

A gAraDIla tamAshaalu - wistarimci ceppuTaku ; ||  

AshaamAshii kAdu, raadha komgu jaalamu,

cilipi ATalADaku, gaDusu krishNuDA!

komgu paTTi lAgitE, mabbu nOTitO -

AkASam urumutumdi, krishNayyA! jaagratta ; || 

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- 

God krishna song-132 - పైటచెంగు మేఘం ;