మనుషులు, మనసారా - ఇచ్చట -
షోడశాలంకార నిపుణులుగా మారినారు
స్వచ్ఛమైన నిపుణులుగా మారినారు ; ||
తల్లి యశోద, రేవతి,
వ్రేపల్లియ ప్రజానీకము -
సేకరించ వచ్చినారు
నెమలి ఈకలు సేకరించ వచ్చినారు ;
వడివడిగా జానపదులు -
చిట్టడవిని తిరుగాడిరి ; ||
"నేను ముందు చూసానని "
నేనంటే నేను - అనుచు -
వాదులాట వినోదాలు ;
ఎల్లరూ, ఉరికి ఉరికి,
పింఛములను ఏరుతూ ఉన్నారు ; ||
బాలక్రిష్ణ ముచ్చటల ముడిలోన -
'బర్హిపింఛముల మెరుపు" ;
"వల్లె వల్లె" అని వెన్నెల -
జత కలిసెను ;
పింఛముల మెరుపులతో -
తెలి వెన్నెల జత కలిసెను ; ||
======================= ;
amdarU nipuNulE-134 ;-
manushulu, manasaaraa - iccaTa -
shODaSAlamkaara nipuNulugaa maarinaaru
swacCamaina nipuNulugaa maarinaaru ; ||
talli yaSOda, rEwati,
wrEpalliya prajaaneekamu -
sEkarimca waccinaaru
nemali eekalu sEkarimca waccinaaru ;
waDiwaDigaa jaanapadulu -
ciTTaDawini tirugADiri ; ||
"nEnu mumdu cuusaanani "
nEnamTE nEnu - anucu -
waadulaaTa winOdaalu ;
ellaruu, uriki uriki,
pimCamulanu Erutuu unnaaru ; ||
baalakrishNa muccaTala muDilOna -
barhipimCamula merupu ;
"walle walle" ani wennela -
jata kalisenu ;
pimCamula merupulatO -
teli wennela jata kalisenu ; ||
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- God krishna song-134 ;
& అందరూ నిపుణులే-134 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి