17, మార్చి 2023, శుక్రవారం

మసక వెన్నెలకు ప్రకాశము-141

మేలిమి తళుకుల నవ్వులవాడు -

                వచ్చేనమ్మా, వచ్చేను ;

మేలిముసుగులో,

       ఇందువదన శోభలకేలా మసకలు -

ఈ మసకమసక వెన్నెలమ్మకు - 

    పూర్ణ శోభలను ఇవ్వవమ్మ, రాధికా!

       సంపూర్ణ శోభలను ఇవ్వవమ్మ, రాధికా! ||

పౌర్ణమి ఇంకా కోరును -     

           అదనపు వెలుగులు, భళీ భళీ! 

నవనీతచోరుడా! ఇక నీ చేతిలోనె ఉన్నది,

శీత పౌర్ణిమకు ఇవ్వగలిగిన ఆ వరము ; ||

తమసులకేలనె భీతిల్లెదవు?

గాఢ తమస్సులకేలనె భీతిల్లెదవు, 

   చంద్రపౌర్ణమీ!

కళారాజ్య తపస్సులిక్కడ, 

అవిరళమ్ముగా సాగుతున్నవి; 

క్రిష్ణరాధల ప్రణయ తపస్సులు ;

నిరాళి కేళిని తేలు వేళలలో - 

తమస్సులంటే భయము ఏలనే!?

ఓ నిండుపౌర్ణమీ మేలుమేలులే,

చాలు చాలులే, భళి భళి భళిలే! ; ||

=========================  ,

masaka wennelaku prakASamu ;- 

mElimi taLukula nawwulawADu 

            waccEnammA, waccEnu ;

mElimusugulO -

            imduwadana SOBalakElA masakalu -

ee masakamasaka wennelammaku - 

    pUrNa SOBalanu iwwawamma, rAdhikA!

      sampUrNa SOBalanu iwwawamma, rAdhikA! ||

paurNami imkA kOrunu -     

           adanapu welugulu, BaLii BaLI! 

nawaneetacOruDA! ika nee cEtilOne unnadi,

       SItapaurNimaku - iwwagaligina A waramu ; ||

tamasulakElane BItilledawu?

gADha tamassulakElane BItilledawu, 

   camdrapaurNamI!

kaLAraajya tapassulikkaDa, 

awiraLammugaa saagutunnawi; 

krishNarAdhala praNaya tapassulu ;

nirALi kELini tElu wELalalO - 

tamassulamTE Bayamu ElanE!?

O nimDupaurNamI mElumElulE,

cAlu cAlulE, BaLi BaLi BaLilE! ; ||

&

 మసక వెన్నెలకు ప్రకాశము-141 &

 God krishna song-141 & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి