24, మార్చి 2023, శుక్రవారం

చిరుగాలి కొంగుముడి బంగారం-148

రజత కాసు, స్వర్ణ నాణెం - 

విలువయిన ధననిధులు ; 

చిరుగాలి కొంగుముడుల నిండా -

            ఉప్పతిల్లు అమూల్య నిధులే!

అమోఘ నవరత్న గని నిధులే! ; ||

వేణురవళి, సిగలోని పింఛాల తళుకు -

కన్నయ్య పలువరుసల మెరుపులు ;

మెడలోని ముత్యాలదండ రోచిస్సులు ;

ఉరము పయిన - పూదండల పరిమళాలు ;

ఇన్నిటినీ వెదజల్లిన తుషార చలువలు ;

ఇన్నింటి కలనేతల గాలి వలువలు ; || 

యమున అలల చల్లగాలి, గోవర్ధన కొండగాలి -

వరిపైరుల మేలమాడు వ్రేపల్లియ చిలిపి గాలి - 

శతకోటి వింత కాంతి, -

            సురభిళాల మన్నికైన పోగులు ;

వన్నె నూలుపోగులతొ, 

తనను తానె మలుచుకుంది - కొత్త వస్త్రమ్ముగా,

గాలి కొత్త దుస్తులు - కాసు-ముడికి ఆలంబనం ; 

సంగీతం, మధుగానం - కొంగుల బంగారము,

గాలి కొంగుల బంగారమే! ; || 

========================== ,

cirugaali komgumuDi bamgaaram  - song ;148 ;- 

rajata kaasu, swarNa nANem - 

wiluwayina dhananidhulu ; 

cirugaali komgu muDula nimDA -

             uppatillu amUlya nidhulE!

amOGa nawaratna gani nidhulE! ; ||

wENurawaLi, sigalOni pimCAla taLuku -

kannayya paluwarusala merupulu ;

meDalOni mutyaaladamDa rOcissulu ;

uramu payina - puudamDala parimaLAlu ;

inniTinI wedajallina tushaara caluwalu ;

innimTi kalanEtala gaali waluwalu ; || 

yamuna alala callagaali, gOwardhana komDagaali -

waripairula mElamADu wrEpalliya cilipi gaali - 

SatakOTi wimta kaamti,  -

            surabhiLAla mannikaina pOgulu ;

wanne nuulupOgulato, tananu taane - -

            malucukumdi kotta wastrammugaa,

gaali kotta dustulu, kaasu-muDiki aalambanam ; 

samgeetam, madhugaanam - komgula bamgaaramu,

gaali komgula bamgaaramE! ; ||  

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;  God krishna song-148 ; 

చిరుగాలి కొంగుముడి బంగారం - 148  ;; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి