అలౌకికానందముల నొసగే
సంగీత జగతీ సృజనకర్తవు -
నీవేనయా, మా ముద్దుకృష్ణా!!
విమలగాంధర్వ వనితలు వచ్చిరి ;
వేణుమాధవా! జాలము సేయకు
వేగమె మన ఉపవనములకేతెంచి,
వచ్చి, మురళిని పట్టరా! చేబూనరా! ; ||
కొత్త పుంతలను తొక్కుతున్నది ;
దేవగాంధర్వం, దేవకీసుతుని కతమున -
స్వర్గమమున సంగీత కళలకు
కొత్త రూపులు కలుగుచున్నవి ఇప్పుడు ; ||
సరళతర గాంధర్వమందున
నూత్న వైవిధ్యతలు ఎన్నో -
స్వర్లోకవాసులకందరికినీ
భవ్య హర్షం, ధవళతేజం ; || `
====================== ,
naTanaawatamsaa, gaanalOlA,
alaukikaanamdamula nosagE
samgeeta jagatee sRjanakartawu -
neewEnayA, maa muddukRshNA!!
wimalagaamdharwa wanitalu wacciri ;
wENumaadhawaa! jaalamu sEyaku
wEgame mana upawanamulakEtemci,
wacci, muraLini paTTarA! cEbUnarA! ; ||
kotta pumtalanu tokkutunnadi ;
dEwagaamdharwam, dEwakeesutuni katamuna -
swargamamuna samgeeta kaLalaku `
kotta ruupulu kalugucunnawi ippuDu ; || ` `
saraLatara gaamdharwamamduna
nuutna waiwidhyatalu ennO -
swarlOkawaasulakamdarikinee
bhawya harsham, dhawaLatEjam ; ||
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;
God krishna song- 153 ; నవ్య దేవగాంధర్వం ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి