అన్నీ ఇన్నీ కావు, కోలాహలములు,
జనుల కోలాహలములు ; ||
ముంగొంగులు నడుమున దోపిరి ;
మగువలు ముంగొంగులు నడుమున దోపిరి ;
ఆడా మగా పిల్లా పీచూ,
అందరు ముందుకు నడిచారు ; ||
కేకలు వేయుచు - ఒకరిని ఒకరు పిలుచుచుండిరి ;
బిగ్గరగా పిలుచుచుండిరి ;
కూటమి అయ్యీ, కూడలి నుండి బయలుదేరిరి ;
పల్లియ చెట్టు-రచ్చబండ కడ -
దినుసుల కుండలు దింపారు -
వలసిన సరుకుల లెక్కచూచుకుని ;
బయలుదేరెను జనసందోహం ; ||
గోవర్ధనగిరి అర్చన - అంటే మాటలు కాదు ;
ముహూర్తవేళ మించకూడదు -
హెచ్చరికలతో కోలాహలములు మిన్నులంటగా -
చేరిరి కొండను ఆబాలగోపాలము ;
మేలిమి నవ్వుల తిలకధారుడు క్రిష్ణుడు ;
ఎప్పుడు చేరెనో మరి -
ముందే అక్కడ అవతరించెను ;
శ్రీకృష్ణ దర్శనము - పారవశ్యత ;
పులకిత పరిమళ మానసమ్ముల -
మనుజులెల్లరూ గిరిపూజలను చేసారు,
పూజలు వరములు - వర్షధారలు ....,
జడివానలతొ నేలతల్లికి పారవశ్యత,
సృష్టికి ఇచ్చే బహుమతులు ; ||
============================ ,
giri arcanalu ;- song-136 ;-
annii innI kAwu, kOlaahalamulu,
janula kOlaahalamulu ; ||
mumgomgulu naDumuna dOpiri ;
maguwalu mumgomgulu naDumuna dOpiri ;
ADA magaa pillaa peecuu,
amdaru mumduku naDicAru ; ||
kEkalu wEyucu - okarini okaru pilucucumDiri ;
biggaragaa pilucucumDiri ;
kUTami ayyii, kUDali numDi bayaludEriri ;
palliya ceTTu-raccabamDa kaDa -
dinusula kumDalu dimpaaru -
walasina sarukula lekkacuucukuni ;
bayaludErenu janasamdOham ; ||
gOwardhanagiri arcana - amTE mATalu kAdu ;
muhuurtawELa mimcakUDadu -
heccarikalatO kOlAhalamulu minnulamTagA -
cEriri komDanu aabaalagOpaalamu ;
mElimi nawwula tilakadhAruDu krishNuDu ;
eppuDu cErenO mari -
mumdE akkaDa awatarimcenu ;
SrIkRshNa darSanamu - paarawaSyata ;
pulakita parimaLa maanasammula -
manujulellaruu giripUjalanu cEsAru,
puujalu waramulu - warshadhaaralu ....,
jaDiwaanalato nElatalliki paarawaSyata,
sRshTiki iccE bahumatulu ; ||
& గిరి అర్చనలు ;- song - 136 ; God krishna song-136 ;
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి