మేలిముసుగులో ఇందువదన,
శోభలకేలా మసకలు -
మసకమసక వెన్నెలకు,
శోభలను ఇవ్వవమ్మ, రాధికా! ||
మేలిమి తళుకుల నవ్వులవాడు
వచ్చేనమ్మా, వచ్చేను ;
ఇక,
వెన్నెలకు శోభలను ఇవ్వవమ్మ, రాధికా!
సంపూర్ణ శోభలను ఇవ్వవమ్మ, రాధికా! ||
పౌర్ణమి ఇంకా కోరును -
అదనపు వెలుగులను, భళి భళీ!
నవనీతచోరుడా!
ఇక నీ చేతిలోనె ఉన్నది,
పౌర్ణిమకు - ఇవ్వగలిగిన వరము ;
తమస్సులకేలనె భీతిల్లెదవు, పౌర్ణమీ!
అవిరళముగ సాగుతున్నవి,
కళారాజ్య తపస్సులు ;
క్రిష్ణరాధ ప్రణయారాధన తపస్సులు ;
నిరాళి కేళి తేలేటి వేళలలో
- తమస్సులంటే భయమేలా!?
ఓ నిండుపౌర్ణమీ, మేలుమేలులే,
చాలు చాలులే, భళి భళి భళిలే!; ||
============================= ,`
masaka wennelaku SOBalu - song - 139 ;-
mElimusugulO imduwadana,
SOBalakElaa masakalu -
masakamasaka wennelaku, ,
SOBalanu iwwawamma, raadhikA! ||
mElimi taLukula nawwulawADu
waccEnammA, waccEnu ;
ika,
wennelaku SOBalanu,
iwwawamma, rAdhikA!
sam pUrNa SOBalanu iwwawamma, rAdhikA! ||
paurNami imkaa kOrunu,
- adanapu welugulanu, BaLi BaLI!
nawaneetacOruDA!
ika nee cEtilOne unnadi,
paurNimaku - iwwagaligina waramu ;
tamassulakElane BItilledawu, paurNamI!
awiraLamuga saagutunnawi,
kaLAraajya tapassulu ;
krishNarAdha praNayaaraadhana tapassulu ;
nirALi kELi tElETi wELalalO -
tamassulamTE BayamElA!?
O nimDupaurNamI, mElumElulE,
cAlu cAlulE, BaLi BaLi BaLilE!; ||
;
పాట 139 ;- మసక వెన్నెలకు శోభలు -
God krishna song-139 & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి