15, మార్చి 2023, బుధవారం

నటనావతంసుడు-140

నటనావతంసుడు కృష్ణుడు వచ్చెను ;

శ్రీకృష్ణస్వామి పదముద్రికల, 

దారులు పద్మము కొలనులు ఆయెను ; || 

నల్లనయ్య అడుగుజాడలు సోకినంతనే,

ధరాతలమ్ము, సకలప్రకృతి -

అణువణువూ పరిమళభరితమాయెను ; ||

వాతావరణము కుశలమాయెను ; 

విశ్వము, ఆనందపత్రిక ఆయెను ;

వసుధ సాంతము, 

   మధు ఋతువులకు, 

     ఆహ్వానపత్రికయె ఆయెను ; ||

సంజీవని మూలిక - 

    ధాతు స్పర్శయే,

       రాధిక పొలుపు ;

తమ్ములమేసిన అధరసుగంధము ;

     హర్షాతిరేకముల అమృతవర్షిణి ;

రాధా అధర సుగంధము అమృతవర్షిణి ;  ||

ఇలాతలమ్ము - ఇంద్రసరస్సులు ; 

నీటి కలువలకు తికమక కలుగుట -

మైమరుపుల అలజడులెపుడూ, 

జగత్తులోన, కడు వినోదమ్మే  ; ||

========================= ,

naTanAwatamsuDu-140 ;-

naTanAwatamsuDu kRshNuDu waccenu ;

SrIkRshNaswaami padamudrikala, 

daarulu padmamu kolanulu Ayenu ; || 

nallanayya aDugujADalu sOkinamtanE,

dharaatalammu, sakalaprakRti -

aNuwaNuwuu parimaLabharitamAyenu ; ||

wAtAwaraNamu kuSalamAyenu ; 

wiSwamu, aanamdapatrika Ayenu ;

wasudha saamtamu, 

   madhu Rtuwulaku, 

     AhwAnapatrikaye Ayenu ; ||

samjIwani muulika - 

    dhaatu sparSayE,

       raadhika polupu ;

tammulamEsina adharasugamdhamu ;

     harshaatirEkamula amRtawarshiNi ;

rAdhA adhara sugamdhamu amRtawarshiNi ;  ||

ilaatalammu - imdrasarassulu ; 

niiTi kaluwalaku tikamaka kaluguTa -

maimarupula alajaDulepuDU, 

jagattulOna, kaDu winOdammE  ; ||

God krishna song-140 & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;

 krishna radha - song -140 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి