యమున అలలపైన
తేలి తేలి విహారాల సమీరం
ఇంత కులుకు ఎందులకో!!? ; ||
కొండగాలి కెరటాల
పంక్తులెన్నొ వరుసలుగా,
క్రిష్ణ మురళి గానమ్మును-
కౌగిలించుకొనుటకై ; ||
నూలుపోగులల్లె -
వాయులీన వయ్యారం
వేణురవళి వంపుసొంపులందున -
ప్రతి పంక్తికి తాదాత్మ్యం ; ||
చిరుగాలి కలనేతల -
"గాలి కొత్త వస్త్రాలు" ;
వలువల కొసముడులందున -
సంగీతం, మధుగానం -
ఆహాహా! కొంగుల బంగారము ; ||
======================== ,
komgula bamgaaramu-152 ;-
yamuna alalapaina
tEli tEli wihaaraala sameeram
imta kuluku emdulakO!!? ; ||
komDagaali keraTAlu/ la
pamktulenno warusalugaa,
krishNa muraLi ganammunu -
kaugilimcukonuTakai ; ||
nuulupOgulalle -
waayuleena wayyaaram
wENurawaLi wampusompulamduna -
prati pamktiki taadaatmyam ; ||
cirugaali kalanEtala -
"gaali kotta wastraalu" ;
waluwala kosamuDulamduna -
samgeetam, madhugaanam -
aahaahaa! komgula bamgaaramu ; ||
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;
God krishna song-152 ;
గాలికొంగుల బంగారము - 152 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి