లలిత భావ లాలిత్య సలలిత -
తప్త మధు బిందుల -
చిన్ని తుంపురుల గిలిగింతల -
అలివేణీ నీలికురుల జిలిబిలి కదలికల -
ఉప్ ఉఫ్ ఉఫ్ఫున కుప్పిగంతుల ;
పరిమళములు అలిమినవి -
ముంగురుల అలకలు,
సిరి జాణ అలుకలు ;
జీరాడుచు కులుకులు ; ||
పడతి అడుగుజాడల ;
పదంబడి, పదములాని,
వేడుకొనేటి వాడుక మనకు -
వేడుకలే, బహు వేడుకలే ; ||
సోయగాల ప్రార్ధనలను మన్నించే -
రాధాక్రిష్ణుల ప్రణయగానముల -
వెన్నెల తరియిస్తూ ఉంటే -
చూచు కనులకు పండుగ ;
నిత్య వీక్షణముల మానసమ్ములకు -
పండుగయే, ప్రతి క్షణమూ పండుగయే ; ||
============================ ,
lalita bhaawa laalitya
salalita tapta madhu bimdula -
cinni tumpurula giligimtala -
aliwENI nIlikurula jilibili kadalikala -
up uph uphphuna kuppigamtula ;
parimaLamulu aliminawi -
mumgurula alakalu,
siri jANa alukalu ;
jIrADucu kulukulu -
paDati aDugujADala ;
padambaDi, padamulaani,
wEDukonETi wADuka manaku -
wEDukalEbahu wEDukalE ; ||
sOyagaala praardhanalanu mannimcE -
raadhAkrishNula praNayagaanamula -
wennela tariyistU umTE -
cUcu kanulaku pamDuga ;
nitya weekshaNamula maanasammulaku -
prati kshaNamU pamDugayE ; ||
&
భావలాలిత్యాలు - God krishna song-142 ;
శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023- 142 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి