క్రిష్ణ ప్రేయసికి -
గురుపీఠమ్ము లభియించె ;
శ్రీకృష్ణ ప్రేయసి రాధికకు -
అరుదైన గురుపీఠ భాగ్యమ్ము లభియించె ;
వహ్వారె, చూడండి, లలనలారా,
రమణీయ ప్రణయదేవతా తూలికా
చిత్రిత మణి వర్ణ శోభలారా! ; ||
రాగాల లహరి - సంగీతలాహిరి ;
రాధమ్మ ఒడిని - కన్నయ్య చేరి ;
ప్రకృతిలోని ప్రతి అణువు ,
బృందావని ఆయె ;
మృదుల బృందావని ఆయె ; ||
అధరమల మురళిని కొనగోట మీటి ;
మధు శృతులు దశదిశల ప్రవహించి ;
రసిక హృదయాలు విరిసి,
ఎల్లెడల పులకింతల రాశి ; ||
ఎవ్వారిదమ్మా ఇపుడు ఈ శిష్యరికము?
మును తనకు తెలియని విద్యలను నేర్వగా ;
వచ్చి చేరినది చిలుకవాహనుని రాణి ;
రాధమ్మ మ్రోల - సత్వరమె - ఇచట -
"పతి ప్రేమ పొందేటి చిట్కాలు తెలుపమని",
బ్రతిమాలుచున్నది -
పుష్పశరముల విలుకాని అర్ధాంగి,
వహ్వారె, వలపు పాఠములు నేర్ప,
గురుస్థానమును అధిరోహించె ;
వయ్యారి నెరజాణ, శ్రీకృష్ణ ష హృదయ సామ్రాజ్ఞి ;
======================================= ,
gurupITha rANi ;- song - 147 ;- -
krishNa prEyasiki -
gurupIThammu laBiyimce ;
SrIkRshNa prEyasi raadhikaku -
arudaina gurupITha bhaagyammu laBiyimce ;
wahwaare, cUDamDi, lalanalaarA,
ramaNIya praNayadEwataa tuulikaa
citrita maNi warNa SOBalArA! ; ||
raagaala lahari - samgItalaahiri ;
raadhamma oDini - kannayya cEri ;
prakRtilOni prati aNuwu ;
bRmdaawani aaye ;
mRdula bRmdaawani aaye ; ||
adharamala muraLini konagOTa mITi ;
madhu SRtulu daSadiSala prawahimci ;
rasika hRdayAlu wirisi,,
elleDala pulakimtala rASi ; ||
ewwaaridammA ipuDu I Sishyarikamu?
munu tanaku teliyani widyalanu nErwagA ;
wacci cErinadi cilukawaahanuni rANi ;
raadhamma mrOla - satwarame - icaTa -
"pati prEma pomdETi ciTkaalu telupamani"
bratimAlucunnadi -
pushpaSaramula wilukaani ardhaamgi,
wahwaare, walapu pAThamulu nErpa,
gurusthAnamunu adhirOhimce ;
wayyAri nerajANa,
SrIkRshNa hRdaya sAmraajni ;
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;
God krishna song-147
& wish u all Happy SOBakRt nAma -
ugaadi SuBAkAmkshalu 2023 ;
& అందరికీ శోభకృత్ నామ -
ఉగాది శుభాకాంక్షలు 2023 ;-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి