20, మార్చి 2023, సోమవారం

వేణుగానము స్వర్ణనావ-145

నీ నయనాల నీడలలోన ;

జీవనయానం సాగవలెనురా, 

 - నా జీవనయానం, 

సాగవలెనురా, నా స్వామీ ; ||

నీ దరి నుంటే అంతే చాలును, 

ముందరి అడుగు నీదోయి,

నీ అడుగులొ అడుగును వేస్తూ ..... 

ఆవలి తీరము చేరుదునోయీ ;

భద్రముగా -

ఆవలి తీరము చేరుదునోయీ  ; ||

మురళీగానము స్వర్ణనావలో - 

బ్రతుకు సాగర ప్రవాహము -

ఆవలి దరిని చేరగలుగుదును ; 

సుభద్రముగా -

ఆవలి తీరము చేరుదునోయీ ||

============================ ,

wENugAnamu swarNanaawa ;-

nee nayanaala nIDalalOna ;

jeewanayaanam saagawalenuraa, 

 - naa jeewanayaanam, 

saagawalenuraa, naa swaamee ; ||

nee dari numTE amtE cAlunu, 

mumdari aDugu needOyi,

nI aDugulo aDugunu wEstU ..... 

Awali teeramu cErudunOyI ;

bhadramugaa -

aawali teeramu cErudunOyI  ; ||

muraLIgAnamu swarNanaawalO - 

bratuku saagara prawaahamu -

aawali darini cEragalugudunu ; 

subhadramugaa -

aawali teeramu cErudunOyI ||;

శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; 

God krishna song-145 ;- వేణుగానము స్వర్ణనావ-145 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి