కోటి కలువల కలల ఆశల దొన్నెలందున -
నీదు ఊహల చలువ వెన్నెలను -
నింపుకొని ఉన్నాను ఇచట, యమునా తటిని క్రిష్ణా! ||
చెంపకు చారెడు కన్నుల - చెలియలు రాధను నేను ;
కలువకన్నుల కన్నీరు నింపుట తగని అలవాటు ;
వ్యధల తిక్త కఠిన కషాయాల కాన్కలిచ్చుట -
పాడి కాదురా, తెలుసు కదరా,
నీకు మున్నే, తెలుసు కదరా, నా స్వామీ! ||
వెన్న పాలు, ఉగ్గుగిన్నెల నీకు ఇత్తురు తరుణులు ;
కఠిన తిక్త కషాయమ్మును ఇచ్చుచున్నావు, చాలును,
"ఎడబాటుల చేదు పానీయాలు" ఇటుల ఇచ్చుట -
పాడి కాదురా, తెలుసు కదరా,
నీకు మున్నే, తెలుసు కదరా, నా స్వామీ! ||
&
song = సబబు* కాదు ;
సబబు* = ఔచిత్య - సమంజసం ;
============================== ,
sababu* kaadu - song-146 ;-
kOTi kaluwala kalala ASala donnelamduna -
needu uuhala caluwa wennelanu -
nimpukoni unnaanu icaTa,
yamunaa taTini krishNA! ||
cempaku caareDu kannula -
celiyalu raadhanu nEnu ;
kaluwakannula kannIru nimpuTa
tagani alawATu ;
wyadhala tikta kaThina
kashAyAla kaan kaliccuTa -
pADi kAdurA, telusu kadaraa,
nIku munnE, telusu kadaraa, nA swAmI! ||
wenna pAlu, ugguginnela nIku itturu taruNulu ;
kaThina tikta kashAyammunu -
iccucunnAwu, cAlunu
eDabATula-cEdu pAnIyAlu iTula iccuTa -
pADi kAduraa, telusu kadaraa,
nIku munnE, telusu kadaraa, nA swAmI!
&
God krishna song-146 ; - sababu* kaadu - song-146 ;-
& + sababu* = aucitya - samamjasam ]; ;
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;
God krishna song-146 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి