2, మార్చి 2023, గురువారం

జలబిందుల ముఖబింబాలు-133

మేఘబాలలొచ్చారు ; 

నీలిగగనతలమును - చదును చేసి, వెళ్ళారు ;

నున్నగా, చదును చేసి వెళ్ళారు 

మేఘాల కుర్రవాళ్ళు ; || 

కాళింది తరగల చల చల్లని తుంపురులు ;

కొండగాలి చిలకరించు నీటి తుంపురులను ; 

వనితా వదనముల పయిన, 

కొండగాలి చిలకరించు ; ||

వికసిత వనితల ముఖబింబములు ;

వేల పురులను విప్పి ఆడెడు నెమళుల వోలె -

వనితల ముఖబింబములు భ్రాంతి విలసిల్లేను ; ||

శిఖిపింఛధారి క్రిష్ణుడు -

పిల్లనగ్రోవి - అల్లన మ్రోగెను,

కోటి మయూరీ నృత్యహేలలు -

మనోపీఠముల అధివసించెను ; ||

====================== ;

jalabimdula mukhabimbaalu ;- 

mEGabAlaloccAru ; 

nIligaganatalamunu - cadunu cEsi, weLLAru ;

nunnagaa, cadunu cEsi weLLAru 

mEGAla kurrawALLu ; || 

kALimdi taragala cala callani tumpurulu ;

komDagAli cilakarimcu nITi tumpurulanu ; 

wanitaa wadanamula payina, 

komDagAli cilakarimcu ; ||

wikasita wanitala mukhabimbamulu ;

wEla purulanu wippi ADeDu nemaLula wOle -

wanitala muKabimbamulu BrAmti wilasillEnu ; ||

SiKipimCadhaari krishNuDu -

pillanagrOwi - allana mrOgenu,

kOTi mayUrI nRtyahElalu -

manOpIThamula adhiwasimcenu ; || 

& జలబిందుల ముఖబింబాలు-133 ;

& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- `God krishna song-133 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి