నీలిమొయిలు చేతి నిండ, చాలా పని ఉన్నది ;
కన్నెపిల్ల నగల మెరుపు, వింత మన్నికైనది ;
పాపిటబిళ్ళ పొడుల -
మెరుపు షోకు సరిచేసెను ;
'మొయిలు మెరుపు' సరిచేసెను ; ||
కన్నియ మెడలోన -
కొంటె కంటె, కిసుక్కున నవ్వినది ;
కొంటె కంటె*, హార ఉంగరములు -
"మా మెరుపులు మిన్న." అనుచు -
మేళమాడుచున్నవి ;
వడ్డాణం, పట్టీలు, కంకణాలు, గాజులు -
పొత్తులుగా, రవల సొగసులిచ్చినవి మబ్బుకు ; ||
రాధ నవ్వు, ఒకటి చాలు, నవరత్నం పోగు సమం ;
తులసీదళధారి క్రిష్ణ చిలిపి వీక్షణాల కోణంగి -
నిఖిల సృష్టికెప్పుడూ - నవ్య వరముల జల్లులు ; ||
& కంటె* = a type of necklace ;
===================================== ,
aame nawwu nawaratnam jallu ;- 143 ;- song ;-
nIlimoyilu cEti nimDa, caalaa pani unnadi ;
kannepilla nagala merupu, -
wimta mannikainadi ;
pApiTabiLLa poDula -
merupu shOku saricEsenu ;
`moyilu merupu` saricEsenu ; ||
kanniya meDalOna -
komTe kamTe, kisukkuna nawwinadi ;
komTe kamTe*, haara umgaramulu -
"mA merupulu minna." anucu -
mELamADucunnawi ;
waDDANam, paTTIlu, kamkaNAlu, gaajulu -
pottulugaa - rawala sogasuliccinawi mabbuku ; ||
rAdha nawwu, okaTi caalu, -
nawaratnam pOgu samam ;
tulasIdaLadhaari krishNa -
cilipi weekshaNAla kONamgi -
niKila sRshTikeppuDU -
nawya waramula jallulu ; ||
& kamTe* = `a type of necklace` ;
&
God krishna song-143 ;-
ఆమె నవ్వు నవరత్నం జల్లు ;- -143 ;
శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023- 143 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి