3, మార్చి 2023, శుక్రవారం

తెలిసింది, బృందావన గమ్మత్తు- -137

రేయి పర్ణశాలలో ఉన్నాది పౌర్ణమి ;

విరహిణి పౌర్ణమికి తోడున్నవి - 

తన వేసారే ఊహలు, వేయి కోట్ల ఊహలు ; ||

మబ్బు పడకపైన వాలిఉంది పున్నమి ;

వడలిన కువలయము వోలె శీతచంద్రిక* ; 

"మెరుపు తూలికలు" వేయును 

             చిత్రమైన తన బొమ్మలు ; ||

పసందైన కేకి ఆట - పున్నమికి వరాలు ;  

పింఛాలు పొదువుకొనెను కోటి మెరుపు వరహాలు ; 

క్రిష్ణ పిల్లంగ్రోవి రాగాలు వచ్చిచేరాయి ;

దశ దిశలా వసంతాల మేళవింపులే ; ||

చిత్ర బాధలు సైతం ప్రకాశించు ఇచ్చట ;

వియోగాలు, విలాపాలు - శోభలగుటయే -

చెప్పలేని వింత కదా - నందనవనమందున ;

ఇది, నందనవన సామ్రాజ్యం, తెలిసివచ్చెను ; || 

&

శీతచంద్రిక* = చల్లని వెన్నెల ; 

=============================== ,

telisimdi, bRmdaawana gammattu-137 ;- 

rEyi parNaSAlalO unnaadi paurNami -

wirahiNi paurNamiki tODunnawi -

tana wEsaarE Uhalu, wEyi kOTla Uhalu ; ||

mabbu paDakapaina waaliumdi punnami ;

waDalina kuwalayamu wOle SItacamdrika* ; 

merupu-tUlikalu wEyunu 

             citramaina tana bommalu ; || 

pasamdaina kEki ATa, punnamiki waraalu ; 

pimCAlu poduwukonenu kOTi merupu warahaalu ; 

krishNa pillamgrOwi rAgAlu waccicErAyi ;

daSa diSalA wasamtaala mELawimpulE ; ||

citra baadhalu saitam prakASimcu iccaTa ;

wiyOgaalu, wilaapaalu - SOBalaguTayE -

ceppalEni wimta kadA - namdanawanamamduna ;

idi, namdanawana saamraajyam, telisiwaccenu ; || 

& SItacamdrika* = callani wennela ;

& తెలిసింది, బృందావన గమ్మత్తు-137 ; 

God krishna song-137 & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి