అదే నింగి, అదే నేల ;
అదేమిటో గానీ - రాధా రాధా!
నీ చూపు సోకగానే
హరివిల్లు విరిసింది,
నింగినీ, నేలనీ -
ఆ - రెంటినీ తాకింది ; ||
లేలేత కిరణాలు -
నీ- కనుబొమల ద్వారాల -
అడుగు మోపంగానె -
గువ్వలు వాలాయి,
గుసగుసలు ఆడాయి ; ||
చిరుగాలి అలలతో పోటీలు ;
యమునమ్మ కెరటాలు ఎగసేను ;
వెన్నెలను మేనెల్లా నింపుకుని -
నీ చూపుల హరివిల్లులకవి
అర్చనలే చేసేను ; ||
============ ,
adE nimgi, adE nEla ;
adEmiTO gAnI - rAdhaa raadhA!
nee cuupu sOkagAnE
hariwillu wirisimdi,
nimginee, nElanee -
aa remTinee taakimdi ; ||
lElEta kiraNAlu -
nee- kanubomala dwaaraala -
aDugu mOpamgaane -
guwwalu waalaayi,
gusagusalu ADAyi ; ||
cirugaali alalatO pOTIlu ;
yamunamma keraTAlu egasEnu ;
wennelanu mEnellaa nimpukuni -
nee cuupula hariwillulakawi
arcanalE cEsEnu ; ||
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2024 ; God krishna song- 155 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి