కమ్మనైన కలలకు -
కలవరింతలేలనే,
పలవరింతలేలనే!?
ప్రేయసి కనురెప్పలలో -
పవ్వళించినాయిగా ;
ఇక కలలకింక -
కలవరింతలేలనే,
పలవరింతలేలనే!? ; ||
మిణుకు చుక్క నవ్వులార! ;
నెలత లతను పూవులుగా - వెలసి, బాగ మురిసేరు ;
రాధ వలపు సీమలకు - మేల్ ముత్యాలు మీరేలే; ||
గురి చూసి దుమికేటి - తుళువ తళుకు ఉల్కలార!
ఇంతి మేను నింతంతగ ఉలికిపాటు మీ వలననే!
తగదు తగదు దుడుకుతనము -
తస్మాత్ జాగ్రత, జాగ్రత! ;
స్నేహమయి బేల తాను ;
ఈ క్రిష్ణ మైత్రి ఉన్న ముగ్ధ - రాధిక ;
జగమెరిగిన విషయమే కదా! ; ||
==================== ,
kalawarimtalu, palawarimtalu ;-
kammanaina kalalaku -
kalawarimtalElanE,
palawarimtalElanE!?
prEyasi kanureppalalO
pawwaLimcinaayigaa ;
ika kalalakimka -
kalawarimtalElanE, palawarimtalElanE!? ; ||
miNuku cukka nawwulaara! ;
nelata latanu puuwulugaa - welasi, baaga murisEru ;
raadha walapu seemalaku - mEl mutyaalu meerElE; ||
guri cuusi dumikETi - tuLuwa taLuku ulkalaara!
imti mEnu nimtamtaga ulikipaaTu mee walananE!
tagadu tagadu duDukutanamu -
tasmaat jaagrata, jaagrata! ;
snEhamayi bEla taanu ;
ee krishNa maitri unna mugdha - raadhika ;
jagamerigina wishayamE kadaa! ; ||
& శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -169 = & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2024 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి