వయ్యారముల
తొణుకుచున్నవి చిక్కని పాలు ;
అయ్యారే, భామలు!
ఆపండి ముచ్చటలు ;
త్వరగ అడుగులేయండి ; ||
శిరసు పయిన కడవలు -
క్షీరాబ్ధి రూపాలు ;
భుజములపయి గంపలు,
నడుము పైన దుత్తలు -
వయ్యారముల -
తొణుకుచున్నవి చిక్కని పాలు ;
అందున చిక్కెను -
తొలి కిరణాలు ; ||
నిమ్మళంగ నడిస్తేను -
ఎండ పొద్దు ఎక్కును ;
చండ్ర ఎండలకు
సోలిపోవు మీ మేనులు ;
వయ్యారముల -
తొణుకుచున్నవి చిక్కని పాలు ;
అమర ఆదిశేషులల్లె -
మెరిసేరు భామినులు! ; ||
చిలిపికృష్ణుని కోసం -
ఆ నెమ్మదైన గమనములు ;
వాని వేణుగాన రవళి సుధలు -
మది నిండగ -
హుషారెక్కు పయనాలు -
పసందుగా, మునుముందుకు ;
సాగేరు చక చకా -
చక్కనైన ధ్యేయాలకు ; ||
============================= ,
merisE BAminulu - 158 ;-
wayyaaramula -
toNukucunnawi cikkani paalu ;
ayyaarE, BAmalu! aapamDi muccaTalu ;
twaraga aDugulEyamDi ; ||
Sirasu payina kaDawalu -
ksheeraabdhi ruupaalu ;
bhujamulapayi gampalu,
naDumu paina duttalu -
wayyaaramula -
toNukucunnawi cikkani paalu ;
amduna cikkenu - toli kiraNAlu ; ||
nimmaLamga naDistEnu -
emDa poddu ekkunu ;
camDra emDalaku
sOlipOwu mee mEnulu ;
wayyaaramula -
toNukucunnawi cikkani paalu ;
aadiSEshulalle -
merisEru BAminulu! ; ||
cilipikRshNuni kOsam -
aa nemmadaina gamanamulu ;
waani wENugaana rawaLi sudhalu -
madi nimDaga -
hushaarekku payanaalu -
pasamdugaa, munumumduku ;
saagEru caka cakaa -
cakkanaina dhyEyaalaku ; ||
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2024 ; God krishna song- 158 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి