3, ఫిబ్రవరి 2024, శనివారం

అమూల్య పెన్నిధి - 170

ఆనందాల అమూల్య పెన్నిధి -

శాంత హర్షముల కారణభూతుడు ;

మనుజ రూపమున ఈనాడు

మన ఎట్టెదుటనె నిలిచెనుగా! ; ||

కలవరమ్ములు, కలతలు వలదు ;

చలువ మాటల పందిరి తానయి -

అభయవరప్రద స్థితి చేకూర్చును ; ||

ప్రకృతి అర్చనల - రక్షాకవచము -

ఆచరణలలో అందించెను కద!

సౌందర్యాల ఆరాధనలను

మానవాళికి అందించెనుగా,

స్థితప్రజ్ఞతలో సోయగమ్ములను -

సేదదీరుటను నేర్పిన గురువు -

భజరే భజరే కృష్ణం మధురం,

భజ గోవిందం, క్రిష్ణ మురారే!

==================== ,

aanamdaala amuulya pennidhi -

SAmta harshamula kAraNaBUtuDu ;

manuja ruupamuna eenADu

mana eTTeduTane nilicenugA! ; ||

kalawarammulu, kalatalu waladu ;

caluwa mATala pamdiri taanayi -

abhayawaraprada sthiti cEkUrcunu ; ||

prakRti arcanala - rakshaakawacamu -

aacaraNalalO amdimcenu kada!

saumdaryaala aaraadhanalanu

maanawALiki amdimcenugaa,

sthitaprajnatalO sOyagammulanu -

sEdadeeruTanu nErpina guruwu -

BajarE BajarE kRshNam madhuram,

Baja gOwimdam, krishNa murArE! 

శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -170 =   శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2024 ; 

Angel number - 170 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి